బస్సు చార్జీల పెంపుపై భగ్గుమన్న విపక్షాలు

ABN , First Publish Date - 2022-07-03T06:25:21+05:30 IST

ఆర్టీసీ చార్జీల పెంపు అన్యాయమని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. చార్జీల పెంపును నిరసిస్తూ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ అవుట్‌ గేటు ముందు శనివారం ఆందోళన చేపట్టారు.

బస్సు చార్జీల పెంపుపై భగ్గుమన్న విపక్షాలు
చార్జీల పెంపునకు నిరసనగా అనకాపల్లిలో ఆందోళన చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పీలా తదితరులు

  టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు

వైసీపీ సర్కారు తీరును  ఎండగట్టిన నాయకులు 

చార్జీలు తగ్గించాలని వామపక్షాల డిమాండ్‌

అనకాపల్లి  అర్బన్‌, జూన్‌ 2 : ఆర్టీసీ చార్జీల పెంపు అన్యాయమని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. చార్జీల పెంపును నిరసిస్తూ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌  అవుట్‌ గేటు ముందు శనివారం  ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు పర్యాయాలు చార్జీలు పెంచి పేదలపై పెనుభారం మోపిం దన్నారు. జగన్‌ పాలనలో అన్నివర్గాల ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. టీడీపీ నాయకులు బీఎస్‌ఎంకే జోగి నాయుడు, మళ్ల సురేంద్ర, కొణతాల శ్రీని వాసరావు, గొర్లె శేఖర్‌, సాయిరాజ్‌, కోటి, చౌదరి, పచ్చికూర రాము, కొణతాల రత్న కుమారి తదితరులు పాల్గొన్నారు. 

అనకాపల్లి టౌన్‌: పెంచిన బస్సు చార్జీలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాల నాయకులు శనివారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదుట ఆందోళన చేపట్టారు.  వామపక్ష నాయకులు ఎ.బాలకృష్ణ, రాజాన దొరబాబు మాట్లాడుతూ రెండు నెలల వ్యవధిలో రెండు దఫాలు చార్జీలు పెంచి వైసీపీ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని మం డిపడ్డారు నాయకులు వీవీ శ్రీనివాసరావు, కాళ్ల తేలయ్యబాబు, మళ్ల మాధవరావు, కోన లక్ష్మణ, కోరిబిల్లి శంకరరావు, బి.ఉమామహేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గొర్లి తరుణ్‌, ఎస్‌. రమణ, ఏఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వియ్యపురాజు, న్యాయవాది సాయి తదితరులు పాల్గొన్నారు.

ఎలమంచిలి : పెంచిన బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని డిమండ్‌ చేస్తూ ఎల మంచిలిలో శనివారం పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావుతో పాటు నాయకులు, కార్యకర్తలు ఇక్కడి పార్టీ ప్రాంతీయ కార్యాలయం నుంచి ప్రధాన రోడ్డు మీదుగా బస్టాండ్‌ వరకూ నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ చలపతిరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నట్టు చెప్పారు. నాయకులు కాండ్రకోట చిరంజీవి, కొఠారు సాంబ, ఆడారి ఆదిమూర్తి, గొర్లె నానాజీ, ఆర్‌ఎస్‌.నాగేశ్వరావు, ఇత్తంశెట్టి రాజు, సర్పంచ్‌ ఇత్తంశెట్టి సన్యాసినాయుడు,  రాజాన వెంకునాయుడు  పాల్గొన్నారు.

పాయకరావుపేట : రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని పట్టణ టీడీపీ అధ్యక్షుడు పెదిరెడ్డి శ్రీను డిమాండ్‌ చేశారు. శనివారం పాయకరావుపేటలో పార్టీ  శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళ చేపట్టి మాట్లాడారు. నాయకులు పల్లా విలియంకేరి, చింతకాయల రాంబాబు, లెక్కల గోవిందు, మలిపెద్ది వెంకటరమణ, ఎం.రమాకుమారి, సూరా సుబ్రహ్మణ్యం, పెదిరెడ్డి పండు, వేములపూడి అప్పారావు, జూరెడ్డి ప్రసాద్‌, చిరుకూరి పేర్రాజు, ఆది, లక్ష్మణ్‌, దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.

నక్కపల్లి :  పెంచిన బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం నక్కపల్లిలో సీపీఎం ఆధ్వర్యంలో పలు కార్మిక సంఘాల ప్రతినిధులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సీఐటీయు కార్యాలయం నుంచి ఉపమాక హైవే జంక్షన్‌ వరకూ డోలీ మోతతో ర్యాలీగా వెళ్లారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజలపై అన్నీ భారాలే అని మండిపడ్డారు.  పార్టీ నాయకులు ఎం.రాజేశ్‌, రాయుడు దండుబాబు, కార్మిక సంఘ ప్రతినిధులు మనబాల శ్రీను, పల్లా శివ, ఈసరపు నాగేశ్వరరావు, చెవ్వేటి రమేశ్‌, చొప్పా దుర్గ, యాదగిరి లక్ష్మణరావు, దేవుడు తదితరులు పాల్గొన్నారు.

మునగపాక : పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని టీడీపీ ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. మునగపాక ఎన్టీఆర్‌ జంక్షన్‌ వద్ద శనివారం ఆర్టీసీ బస్సును  ఆపి, చార్జీల పెంపుపై నినాదాలు చేశారు. అనంతరం ఆర్టీసీ బస్సు ఎక్కి టిక్కెట్‌ తీసుకుని ప్రయాణం చేసి, కండక్టర్‌కు చార్జీలు తగ్గించాలని  వినతిపత్రం అందజేశారు. టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు ఆడారి మంజు, టీడీపీ నాయకులు మళ్ల రాజేష్‌, దాడి ముసిలినాయుడు, మళ్ల వరహా నరసింగరావు, పెంటకోట విజయ్‌, మురళీ, ఆడారి జనార్థనరావు, వీర రాజశేఖర్‌, రామ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

రాంబిల్లి : పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని సీపీఎం మండల కార్యదర్శి జి.దేముడునాయుడు డిమాండ్‌ చేశారు. మండల కేంద్రం రాంబిల్లిలో శనివారం మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారాలు మోపుతోందన్నారు. ఈ కార్యక్రమంలో నాయ కులు కె.నూకరత్నం, సిహెచ్‌ పవన్‌కుమార్‌, వై.రాము తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌.రాయవరం : ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. మండలంలోని అడ్డరోడ్డు వద్ద సీపీఎం నాయకులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ రెండు నెలల వ్యవధిలోనే ఆర్టీసీ చార్జీలు పెంచడం వైసీపీ ప్రభుత్వానికి తగదన్నారు. సంఘం నాయకులు రంగనాయకులు, అప్పన్న, త్రిమూర్తులు, రమణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

పరవాడ: పెంచిన ఆర్టీసీ చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో శనివారం పరవాడ సినిమాహాల్‌ జంక్షన్‌ వద్ద ఆందోళన చేపట్టారు. ఆ పార్టీ మండల నాయకురాలు పి.మాణిక్యం మాట్లాడుతూ రెండు నెలల కాలంలో చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపడం దుర్మార్గమన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ, కె.నాయుడు, జి.శ్రీను, అప్పారావు, లచ్చిబాబు, బాబ్జీ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-03T06:25:21+05:30 IST