ఆస్తి పన్ను పెంపును వ్యతిరేకించాలి

ABN , First Publish Date - 2021-06-25T05:58:46+05:30 IST

రాజకీయాలకు అతీతంగా పన్నుల పెంపును వ్యతిరేకించాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ పిలుపునిచ్చారు.

ఆస్తి పన్ను పెంపును వ్యతిరేకించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌

ఆస్తి పన్ను పెంపును వ్యతిరేకించాలి

ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ పిలుపు

పటమట, జూన్‌ 24: రాజకీయాలకు అతీతంగా పన్నుల పెంపును వ్యతిరేకించాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ పిలుపునిచ్చారు. జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయిన రెండేళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో అతలాకుతలం అయ్యిందని అన్నారు. గురువారం 10వ డివిజన్‌లోని వాసవీ నగర్‌ కాలనీ కమ్యూనిటీ హాలులో ఆస్తి, యూజర్‌ చార్జీల పెంపుదలపై అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గద్దె మాట్లాడుతూ చెత్త పన్నులు వసూలు చేసేందుకు 4, 10 డివిజన్లను దత్తత  తీసుకోవడం ఆశ్చర్య కరంగా ఉందన్నారు. ఆస్తి పన్ను 5 నుంచి 10 రెట్లు పెంచడం, డ్రెయినేజీ చార్జీలు పెంచడం ప్రజా వ్యతిరేక చర్య అని అన్నారు. సమావేశంలో సీపీఎం నాయకులు సీహెచ్‌ బాబురావు, దోనే పూడి కాశీనాథ్‌, సీపీఐ నాయకులు దోనేపూడి శంకర్‌, జనసేన నాయకులు బత్తిన రాము, టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ నెలిబండ్ల బాలస్వామి, కాలనీ పెద్దలు పాల్గొన్నారు.

లాక్‌డౌన్‌లో సేవలు అభినందనీయం 

రామలింగేశ్వరనగర్‌: కరోనా కారణంగా లాక్‌డౌన్‌ సమయంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి స్వయం ఉపాధి నిమిత్తం దాతలు సహాయాలు అందించటం గొప్ప విషయం అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ పేర్కొన్నారు. గురువారం 14వ డివిజన్‌ దర్శిపేటలో ఎమ్మెల్యే గద్దె పర్యటించారు. నిరుపేద కుటుంబానికి చెందిన సామ్రాజ్యంకు డివిజన్‌ పార్టీ నాయకులు కర్ణా కోటేశ్వరరావు 15 వేల విలువ చేసే కూరగాయల తోపుడు బండిని గద్దె రామ్మోహన్‌ చేతుల మీదుగా అందించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకులు కర్ణా కోటేశ్వరరావు పేద మహిళకు సహాయం చేయడం అభినందనీయమని  తెలిపారు.  డివిజన్‌ పార్టీ అధ్యక్షులు నర్రా కిషోర్‌, బద్రి, చెరుకూరి సాంబయ్య, ఆచంట వాసు, మాదు శివయ్య, అన్నాబత్తుని బాబి, తాడేపల్లి నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-25T05:58:46+05:30 IST