తెనాలి: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ప్రజలందరూ తిప్పి కొట్టాలని సీపీఎం రాష్ట్ర నాయకులు వి.కృష్ణయ్య పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని చెంచుపేట ప్రజా సంఘాల కార్యాలయంలో సీపీఎం 22వ మహాసభలను ఘనంగా నిర్వహించారు. హుస్సేన్ వలి అధ్యక్షతన జరిగిన సభలో కృష్ణయ్య మాట్లాడు తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. మూడు వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ చట్టం, కార్మికుల హక్కుల ను హరిస్తూ తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు, ప్రభుత్వ రంగసంస్థల ప్రైవేటీకరణ, మానిటైజేషన్ పేరుతో ప్రభుత్వ సంస్థలను సర్వీసు రంగాలను లీజుకు ఇచ్చేవిధానం వంటి చర్యలతో రాబోవు రోజుల్లో ప్రజలపై మరింత ఆర్థిక భారం పడనుందన్నారు. వీటిని అడ్డుకోవడంలో రాష్ట్రంలో ఉన్న ప్రధాన రెండు పార్టీలు విఫలమయ్యాయన్నారు. కార్యక్రమంలో ఎన్ భవన్నారాయణ, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.