సచివాలయాల్లో అమ్మఒడి అభ్యంతరాల పరిష్కారానికి అవకాశం

ABN , First Publish Date - 2020-02-20T06:46:08+05:30 IST

అమ్మఒడి ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకుని వివిధ కారణాల వల్ల పెండింగ్‌ జాబితాలో చేరిన విద్యార్థులకు తాజాగా

సచివాలయాల్లో అమ్మఒడి అభ్యంతరాల పరిష్కారానికి అవకాశం

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఫిబ్రవరి 19 : అమ్మఒడి ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకుని వివిధ కారణాల వల్ల పెండింగ్‌ జాబితాలో చేరిన విద్యార్థులకు తాజాగా సంబంధిత అభ్యంతరాలను పరిష్కరించుకునే వెసులు కల్పించారు. జిల్లాలో మొత్తం 73 వేల మంది విద్యార్థులు పెండింగ్‌ జాబితాలో ఉన్న విషయం విదితమే.


వీరిలో నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ వినియోగం, నాలుగు చక్రాల వాహనం, ఆదాయపు పన్ను చెల్లింపు, నిర్ణీత పరిమితి కంటే వ్యవసాయ భూమి ఎక్కువగా ఉండడం వంటి కారణాలు వల్ల సుమారు 35 వేల మంది అమ్మఒడి ఆర్థిక సాయానికి దూరమ య్యారు. తాజాగా వీరంతా సంబంధిత గ్రామ సచివాలయానికి  వెళ్ళి,  అభ్యంతరాలను పరిష్కరించుకునేందుకు అవకాశం కల్పించారు. అప్పీళ్ళను సంబంధిత పత్రాలతో సచివాలయాల్లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అప్పీళ్ళ అప్‌లోడ్‌కు రేషన్‌కార్డు తప్పనిసరి చేశారు. 

Updated Date - 2020-02-20T06:46:08+05:30 IST