అవకాశాలను అందిపుచ్చుకోవాలి

ABN , First Publish Date - 2022-05-29T05:05:42+05:30 IST

ఉద్యోగాలు పొందేందుకు మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వం అందిసున్న ఉచిత కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవా లని రాష్ట్ర ప్రభుత్వ అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ సలహాదారు, రిటైర్డ్‌ ఐపీఎస్‌ ఏకే ఖాన్‌ అన్నారు.

అవకాశాలను అందిపుచ్చుకోవాలి
విద్యార్థులతో మాట్లాడుతున్న ఏకే ఖాన్‌

- రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారు, 

రిటైర్ట్‌  ఐపీఎస్‌ అధికారి ఏకే ఖాన్‌


మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, మే 28 : ఉద్యోగాలు పొందేందుకు మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వం అందిసున్న ఉచిత కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవా లని రాష్ట్ర ప్రభుత్వ అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ సలహాదారు, రిటైర్డ్‌ ఐపీఎస్‌ ఏకే ఖాన్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బీకేరెడ్డి కాలనీలో గల తెలంగాణ రాష్ట్ర మైనార్టీ గురుకుల బాలుర పాఠశాల, కళాశాలలో మైనార్టీ విద్యార్థులకు ఉచితంగా ఇస్తున్న కోచింగ్‌ సెంటర్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోచింగ్‌ తీసుకుంటున్న అభ్యర్థులతో ఆయన మాట్లాడారు. సౌక ర్యాలు ఎలా ఉన్నాయని అడిగా తెలుసుకున్నారు. అనంతరం గురుకుల పాఠశా ల, కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాకులతో మాట్లాడి పనితీరుపై అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ  పదవ తరగతి తర్వాత ఉండే అవకాశాలు, ఇంటర్‌ తర్వాత ఉండే కోర్పులు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 80 వేల ఉద్యోగాల భర్తీకి నోటిపికేషన్లు జారీ చేసిందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తరఫున ఉచిత కోచింగ్‌ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదవాలన్నారు. ఉద్యోగాల కోసం సిద్ధమయ్యే అఽభ్యర్థులు ఇష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. పాలమూరు జిల్లా నుంచి ఎంతో మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ఉన్నారని గుర్తు చేశారు. వారి స్ఫూర్తితో కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించాలన్నారు. అంతకుముందు ఏకే ఖాన్‌కు అదనపు కలెక్టర్‌ సీతారామారావు స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఇంతియాజ్‌ ఇషాక్‌, కళాశాల, పాఠశాల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-29T05:05:42+05:30 IST