మరో రెండు సూపర్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసిన ఒప్పో

ABN , First Publish Date - 2020-06-06T22:37:44+05:30 IST

మొబైల్ మేకర్ ఒప్పో మరో రెండు స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఒప్పో రెనో 4 ప్రొ, ఒప్పో రెనో 4 మొబైళ్లను

మరో రెండు సూపర్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసిన ఒప్పో

న్యూఢిల్లీ: చైనీస్ మొబైల్ మేకర్ ఒప్పో మరో రెండు స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఒప్పో రెనో 4 ప్రొ, ఒప్పో రెనో 4 మొబైళ్లను చైనాలో విడుదల చేసింది. ట్రిపుల్ రియర్ కెమెరాలు, స్నాప్‌డ్రాగన్ 765జి ఎస్ఓఎస్, 5జీ కనెక్టివిటీ కలిగిన ఈ ఫోన్లు 65W సూపర్ వూక్ 2.0 ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. ఒప్పో రెనో 4 ప్రొ 8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర దాదాపు రూ. 40,500 కాగా, 12 జీబీ ర్యామ్+256జీబీ వేరియంట్ ధర రూ. 45,800. ఈ నెల 18 నుంచి సేల్‌కు రానుంది.

ఒప్పో రెనో 4 8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర సుమారు రూ. 32 వేలు కాగా, 8జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజీ ఆప్షన్ ధర దాదాపు రూ. 35,200. ఇది ఈ నెల 12 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఈ రెండు ఫోన్లు త్వరలోనే భారత్‌లో విడుదల కానున్నాయి. 

Updated Date - 2020-06-06T22:37:44+05:30 IST