క్వాడ్ రియర్ కెమెరాతో మరో రెండు 5జీ ఫోన్లను విడుదల చేసిన ఒప్పో

ABN , First Publish Date - 2021-03-09T02:53:31+05:30 IST

ఒప్పో ఎఫ్ 19 ప్రొ సిరీస్‌లో మరో రెండు ఫోన్లు వచ్చేశాయి. ఒప్పో ఎఫ్19 ప్రొ ప్లస్, ఒప్పో ఎఫ్ 19 ప్రొలు నేడు భారత

క్వాడ్ రియర్ కెమెరాతో మరో రెండు 5జీ ఫోన్లను విడుదల చేసిన ఒప్పో

న్యూఢిల్లీ: ఒప్పో ఎఫ్ 19 ప్రొ సిరీస్‌లో మరో రెండు ఫోన్లు వచ్చేశాయి. ఒప్పో ఎఫ్19 ప్రొ ప్లస్, ఒప్పో ఎఫ్ 19 ప్రొలు నేడు భారత మార్కెట్లో విడుదలయ్యాయి. క్వాడ్ రియర్ కెమెరాలు, సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉన్నాయి ఒప్పో ఎప్ 19 ప్రొ ప్లస్ 5జీకి సపోర్ట్ చేస్తుంది. ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఒప్పో ఎఫ్ 19 ప్రొ మాత్రం 4జీకి సపోర్ట్ చేస్తుంది. ఇందులో మీడియాటెక్ హెలియో పీ95 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 


ఒప్పో ఎఫ్19 ప్రొ ప్లస్ 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 25,990 కాగా, ఒప్పో ఎఫ్19 ప్రొ 8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజీ ఆప్షన్ ధర రూ. 21,490 మాత్రమే. 8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజీ మోడల్ దర రూ. 23,490గా కంపెనీ పేర్కొంది. ఫ్లూయిడ్ బ్లాక్, స్పేస్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. 


ఒప్పో ఎఫ్19 ప్రొ ప్లస్, ఒప్పో ఎఫ్19 ప్రొలు ఈ నెల 17 నుంచి సేల్‌కు రానున్నాయి. అలాగే, ముందుస్తు ఆర్డర్‌కు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఒప్పో ఎఫ్19 ప్రొలోని 8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజీ వేరియంట్ మాత్రం ఈ నెల 25 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. 


ఒప్పో ఎఫ్ 19 ప్రొ ప్లస్ స్పెసిఫికేషన్లు: కలర్ ఓఎస్ 11.1తో కూడిన ఆండ్రాయిడ్ 11 ఓఎస్, 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, వెనకవైపు 48 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో కూడిన నాలుగు కెమెరాలు, సెల్ఫీల కోసం ముందువైపు 16 ఎంపీ కెమెరా. 128 జీబీని 256 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, 5జీ, 4జీ కనెక్టివిటీ, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్.


ఒప్పో ఎప్ 19ప్రొ స్సెసిఫికేషన్లు:  కలర్ ఓఎస్ 11.1తో కూడిన ఆండ్రాయిడ్ 11 ఓఎస్, 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, వెనకవైపు 48 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో కూడిన నాలుగు కెమెరాలు, 4,310 ఎంఏహెచ్ బ్యాటరీ, 30W వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. మిగతా స్పెసిఫికేషన్ల గురించి వెల్లడించాల్సి ఉంది. 

Updated Date - 2021-03-09T02:53:31+05:30 IST