విపక్షాల Vice president అభ్యర్థిగా Margaret Alva

ABN , First Publish Date - 2022-07-17T22:40:57+05:30 IST

రాజస్థాన్ మాజీ గవర్నర్ మార్గరెట్ ఆల్వా ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా విపక్ష పార్టీలు నిర్ణయించాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్...

విపక్షాల Vice president అభ్యర్థిగా Margaret Alva

న్యూఢిల్లీ: రాజస్థాన్ మాజీ గవర్నర్ మార్గరెట్ ఆల్వా (Margaret Alva)ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా విపక్ష పార్టీలు నిర్ణయించాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ నివాసంలో ఆదివారం సమావేశమైన విపక్ష పార్టీల నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు, అనుసరించాల్సి వ్యూహంపై కూడా ఈ సమావేశంలో విపక్ష పార్టీల నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే, సీపీఎం నేత సీతారా ఏచూరి, శివసేన నేత సంజయ్ రౌత్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.


రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరును ముందుగానే ప్రకటించిన విపక్ష పార్టీలు ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో మాత్రం ఎన్డీయే ప్రకటించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నాయి. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్‌ పేరును ఎన్డీయే ఆదివారంనాడు ప్రకటించింది. కాగా, ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్లు వేసే గడువు ఈనెల 19వ తేదీతో ముగుస్తుంది.

Updated Date - 2022-07-17T22:40:57+05:30 IST