అరకటవేములలో కంటి వైద్య శిబిరం

ABN , First Publish Date - 2022-10-03T05:15:26+05:30 IST

మండలంలోని అరకటవేముల గ్రామంలో తానా ఆధ్వర్యంలో ఉచిత కంటివైద్యశిబిరాన్ని నిర్వహించారు.

అరకటవేములలో కంటి వైద్య శిబిరం
కార్యక్రమంలో మాట్లాడుతున్న వక్తలు

 పుట్లూరు, అక్టోబరు 2: మండలంలోని అరకటవేముల గ్రామంలో తానా ఆధ్వర్యంలో ఉచిత కంటివైద్యశిబిరాన్ని నిర్వహించారు. ఎనఆర్‌ఐ రవినాయుడు కుమార్తె హితేష్న పుట్టినరోజు సందర్భంగా ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎనఆర్‌ఐ, తానా సభ్యుడు పొత్తూరి రవినాయుడు ఆధ్వర్యంలో సక్షమ్‌, పుష్పగిరి ఆసుపత్రి వైద్యులు వైద్యపరీక్షలు చేశారు. ఈ సందర్భంగా సక్షమ్‌ సుంకు వేణుగోపాల్‌ మాట్లాడుతూ అమెరికాలోని తెలుగు అసోసియేషన ఆఫ్‌ నార్త్‌ అమెరికా సహకారంతో కంటిపరీక్షలు, ఆపరేషన్లు చేయించడం సంతోషదగ్గ విషయమన్నారు. ఉపాధ్యాయుడు బండారు శంకర్‌ మాట్లాడుతూ విదేశాల్లో ఉన్న రవినాయుడు తన ఊరిపై మమకారంతో విద్య, వైద్యం అందించాలనే తపన ఎనలేనిదన్నారు. కాగా ఆదివారం జరిగిన వైద్య శిబిరంలో 211 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి మందులను పంపిణీచేశారు. శస్త్రచికిత్సల కోసం 110 మందిని ఎంపికచేశారు. అనంతరం ఎనఆర్‌ఐ తల్లిదండ్రులు పొత్తూరి నారాయణ, లక్ష్మిదేవమ్మను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ బాలరంగయ్య, సోమశేఖర్‌నాయుడు, నల్లగొండ రాయుడు, ఓబులేసు, సక్షమ్‌ జిల్లా కార్యదర్శి మల్లికార్జున, వైద్యులు భానుకిరణ్‌, లక్ష్మి, భాగ్యలక్ష్మి, శీనానాయక్‌, ప్రాణేష్‌, విశ్వనాథరెడ్డి, ఎనసీసీ విద్యార్థులు, పెద్దయ్య పాల్గొన్నారు.




Updated Date - 2022-10-03T05:15:26+05:30 IST