బాలల సంరక్షణకు ఆపరేషన్‌ ముస్కాన్‌

ABN , First Publish Date - 2022-07-02T04:44:35+05:30 IST

బాలలహక్కుల పరిరక్షణలో భాగంగా ఆపరేషన్‌ ముస్కాన్‌-08 బృందాన్ని సిద్ధం చేసినట్లు ఎస్పీ కె సురేష్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో అధికారులతో ప్రత్యేకసమా వేశం ఏర్పాటుచేశారు.

బాలల సంరక్షణకు ఆపరేషన్‌ ముస్కాన్‌
పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఎస్పీ సురేష్‌కుమార్‌

- ఎస్పీ సురేష్‌కుమార్‌

ఆసిఫాబాద్‌, జూలై 1: బాలలహక్కుల పరిరక్షణలో భాగంగా ఆపరేషన్‌ ముస్కాన్‌-08 బృందాన్ని సిద్ధం చేసినట్లు ఎస్పీ కె సురేష్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో అధికారులతో ప్రత్యేకసమా వేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆపరేషన్‌ ముస్కాన్‌లో పోలీసు, విద్య, రెవెన్యూ, కార్మి కశాఖల అధికారులు, బాలల రక్షణ విభాగం అధికా రులు భాగస్వామ్యులు అవుతారన్నారు. అధికారులం దరూ సమన్వయంతో జిల్లాలో ఉన్న బాలకార్మికులను బడిలో చేర్పించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. శుక్రవారంనుంచి ఈనెల31వరకు ఆపరేషన్‌ ముస్కా న్‌ కార్యక్రమం జరుగుతుందన్నారు. బాలకార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తామమని హెచ్చరించారు. బాలకార్మికులను గుర్తిం చిన వారు డయల్‌ 100కులేదా 1098కుసమాచారం అందించాలన్నారు. అనంతరం ఆపరేషన్‌ ముస్కాన్‌కు సంబంధించిన పోస్టర్లను విడుదలచేశారు. ఏఎస్పీ (అడ్మిన్‌) అచ్చేశ్వర్‌రావు, ఏఆర్‌ ఏఎస్పీ భీంరావు, డీసీపీవో మహేష్‌, జిల్లా విద్యాధికారి అశోక్‌, ఎంఈవో ఎంవీస్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T04:44:35+05:30 IST