ఎంపీ అరెస్టును సమర్థిస్తున్నాం : మంత్రి వనిత

ABN , First Publish Date - 2021-05-16T05:51:10+05:30 IST

నరసాపురం ఎంపీగా రఘు రామకృష్ణంరాజు గెలిచారంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి భిక్షేనని రాష్ట్ర స్ర్తీ శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత అన్నారు.

ఎంపీ అరెస్టును సమర్థిస్తున్నాం : మంత్రి వనిత

కొవ్వూరు, మే 15: నరసాపురం ఎంపీగా రఘు రామకృష్ణంరాజు గెలిచారంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి భిక్షేనని రాష్ట్ర స్ర్తీ శిశు సంక్షేమ శాఖా మంత్రి  తానేటి వనిత అన్నారు. శనివారం కొవ్వూరులో ఆమె విలేకర్ల సమావేశంలో మాట్లాడు తూ పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేయ డం సరికాదని, ప్రజాప్రతినిధికి ఉండాల్సిన లక్షణా లు ఆయనకు ఒక్కటి కూడా లేవన్నారు. ఎంపీగా గెలిచి రెండేళ్ళు కావస్తున్నా ఆయన ప్రజలకు చేసిం దేమీ లేదన్నారు. రఘురామకృష్ణంరాజు అరెస్టును తామంతా సమర్థిస్తు న్నామని,  చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. 

ఎంపీ అరెస్టు, హింస అమానుషం : టీడీపీ

కామవరపుకోట: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ప్రశ్నించిన ఎంపీ రఘురామ కృష్ణంరాజును అరెస్టు చేయడం, కొట్టి హింసించడం అమానుషమని మండల టీడీపీ నేత కిలారు సత్యనారాయణ శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సభ్యుడిపై రాజద్రోహం కేసు ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిపాలన ప్రజా స్వామ్యయుతంగా కాకుండా, నియంతృత్వ ధోరణిలో సాగుతోందని  విమర్శించారు. రాష్ట్ర ప్రజలు, మీడియా భావప్రకటనా స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యవాదులు దీనిని ఖండించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  

Updated Date - 2021-05-16T05:51:10+05:30 IST