నిజామాబాద్‌లో తొలి కేఎఫ్‌సీ రెస్టారెంట్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2020-10-24T22:56:08+05:30 IST

నిజామాబాద్‌లో తొలి కేఎఫ్‌సీ రెస్టారెంట్‌ ప్రారంభం

నిజామాబాద్‌లో తొలి కేఎఫ్‌సీ రెస్టారెంట్‌ ప్రారంభం

నిజామాబాద్‌: ప్రపంచంలో అత్యంత రుచికరమైన 'చికెన్' అందించడంలో ఖ్యాతినార్జించిన కేఎఫ్‌సీ ఇండియా తన మొదటి రెస్టారెంట్‌ను నిజామాబాద్ నగరంలో ప్రారంభించింది. కోడిమాంసాన్ని-ఇష్టపడే వారి కోసం సరికొత్త గమ్యస్థానంగా దీన్ని ప్రగతి నగర్‌లోని వేణు మాల్‌లో ఏర్పాటు చేశారు. హాట్ అండ్ క్రిస్పీ చికెన్, చికెన్ పాప్‌కార్న్, చికెన్ స్ట్రిప్స్, జింగర్ బర్గర్ తదితర కేఎఫ్‌సీ ఫేవరెట్స్ కోసం రెస్టారెంట్‌కు విచ్చేయాలని కోరింది.


4ఎక్స్ సేఫ్టీ ప్రామిస్ ఆఫ్ శానిటైజేషన్, స్క్రీనింగ్, సామాజిక దూరం మరియు కాంటాక్ట్‌లెస్ సేవలతో నగరంలో తన సేవలను ప్రారంభించింది. రెస్టారెంట్‌లో ప్రతి 30 నిమిషాలకు ఒకసారి టేబుళ్లు, కౌంటర్లు, తలుపులు, తలుపుల హ్యాండిళ్లను తీవ్రస్థాయిలో శానిటైజేషన్ చేస్తామని పేర్కొంది.  డెలివరీ బృందాలు ప్రతి ఆర్డర్ తర్వాత వారి చేతులు మరియు సంచులను శుభ్రపరచుకోవడంతో పాటు వారికి క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయడం మరియు నిత్యం ఉష్ణోగ్రత పరీక్షలు, మాస్కులు ధరించి ఉండడం, ఎల్లప్పుడూ గ్లౌజులు ధరించి ఉండేలాగా జాగ్రత్తలు తీసుకుంటారు. వినియోగదారులు భౌతిక దూరాన్ని పాటించేందుకు మరియు డెలివరీ రైడర్లు ఆర్డర్ల కోసం క్యూలో ఉన్నప్పుడు కనీసం 6 అడుగుల సురక్షితమైన దూరాన్ని పాటించేందుకు అనుగుణంగా నేలపై స్టిక్కర్లను అంటించారు.


వేణు మాల్‌లో ఉన్న కేఎఫ్‌సీ రెస్టారెంట్ 2264 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా, 78 మంది కూర్చునేందుకు సదుపాయాలు ఉన్నాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. అదే విధంగా మీకు ఇష్టమైన వాటిని మీ సౌకర్యానికి అనుగుణంగా ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌లో కేఎఫ్‌సీ యాప్ ద్వారా కేఎఫ్‌సీ వెబ్‌సైట్ లేదా మొబైల్ సైట్  (www.kfc.co.in)లో ఆర్డర్ చేసుకుని మీకు కావలసినవి తెప్పించుకోవచ్చు.


Updated Date - 2020-10-24T22:56:08+05:30 IST