అరకులోయలో 100 పడకల కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2021-05-17T04:19:32+05:30 IST

అరకులోయ పట్టణంలో 100 పడకల కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఆదివారం ప్రారంభమైంది. స్థానిక యువజన శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ సెంటరును అరకులోయ శాసనసభ్యుడు చెట్టి ఫాల్గుణ, పాడేరు ఆర్‌డీవో లక్ష్మీశివజ్యోతి ప్రారంభించారు.

అరకులోయలో 100 పడకల కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ప్రారంభం
అరకులోయలో కొవిడ్‌ కేర్‌ సెంటరు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఫాల్గుణ, ఆర్‌డీవో కేఎల్‌ శివజ్యోతి


అరకులోయ టౌన్‌, మే 16: అరకులోయ పట్టణంలో 100 పడకల కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఆదివారం ప్రారంభమైంది. స్థానిక యువజన శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ సెంటరును అరకులోయ శాసనసభ్యుడు చెట్టి ఫాల్గుణ, పాడేరు ఆర్‌డీవో లక్ష్మీశివజ్యోతి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెరుగుతున్న కొవిడ్‌ బాధితులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో అరకులోయలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ప్రారంభించిందన్నారు. కొవిడ్‌ లక్షణాలు కలిగి, హోమ్‌ ఐసోలేషన్‌కు అవకాశం లేని వారందరికీ ఈ కొవిడ్‌ కేర్‌ సెంటరులో చికిత్స అందించడం జరుగుతుందన్నారు. కొవిడ్‌ స్వల్ప లక్షణాల బాధితులకు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ వుంటుందని, మంచి పౌష్టికాహారం అందించడం జరుగుతుంన్నారు. బాధితులకు అత్యవసర చికిత్స అవసరమైతే అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని వారు కొవిడ్‌ కేర్‌ సెంటరు నిర్వాహకులను ఆదేశించారు. 

Updated Date - 2021-05-17T04:19:32+05:30 IST