జేఎన్టీయూ కళాశాలలో పలు నిర్మాణాలకు శంకుస్థాపన

ABN , First Publish Date - 2020-12-03T04:51:46+05:30 IST

పట్టణంలోని జేఎన్టీయూ కళాశాలలో పలు నిర్మాణాలకు కడప ఎంపీ వైఎస్‌ అవినా్‌షరెడ్డి శంకుస్థాపన చేశారు.

జేఎన్టీయూ కళాశాలలో పలు నిర్మాణాలకు శంకుస్థాపన
పులివెందుల జేఎన్టీయూలో వసతి గృహం ప్రారంభ కార్యక్రమంలో ఎంపీ అవినా్‌షరెడ్డి, వీసీ శ్రీనివాసకుమార్‌

పులివెందుల రూరల్‌, డిసెంబరు 2: పట్టణంలోని జేఎన్టీయూ కళాశాలలో పలు నిర్మాణాలకు కడప ఎంపీ వైఎస్‌ అవినా్‌షరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతపురం జేఎన్టీయూ వైస్‌చాన్సిలర్‌ ప్రొఫెసర్‌ శ్రీనివాసకుమార్‌తో కలిసి ఆయన కళాశాల ఆవరణలో రూ.2కోట్లతో నూతన బ్యాంకు, పోస్టాఫీసు భవన నిర్మాణానికి, రూ.2.85కోట్లతో సివిల్‌ అకడమిక్‌ బ్లాక్‌ మొదటి అంతస్థు భవనం నిర్మాణానికి, రూ.1.50కోట్లతో స్టూడెంట్స్‌ క్యాంటీన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే రూ.5.5కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన బాలుర వసతి గృహం, సోలార్‌ పవర్‌ప్లాంట్‌లను ఎంపీ ప్రారంభించారు. అలాగే ఎంపీ అవినా్‌షరెడ్డి సమక్షంలో కళాశాలలో రూ.10కోట్ల వ్యయంతో లెక్చర్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులకు జేఎన్టీయూ అనంతపురం రిజిస్ర్టార్‌చే, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ వారిచే ఒప్పందం కుదుర్చుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ జీఎ్‌సఎస్‌ రాజు తెలిపారు. కార్యక్రమంలో ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, జేఎన్టీయూ అనంతపురం రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ విజయ్‌కుమార్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-03T04:51:46+05:30 IST