ప్రజారోగ్యం కోసమే ఓపెన్‌జిమ్‌లు

ABN , First Publish Date - 2022-01-21T04:00:29+05:30 IST

ప్రజారోగ్యమే లక్ష్యం గా ఓపెన్‌జిమ్‌లను ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ తెలిపారు. గురువారం పట్టణంలో రూ.43 లక్షలతో ప్రాణహిత కాలనీ, శ్రీపతినగర్‌, యాపల్‌ ఏరియాల్లో ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌లను జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీఓదెలుతో కలిసి ప్రారంభించారు. విప్‌ మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రజారోగ్యం కోసమే ఓపెన్‌జిమ్‌లు
ఓపెన్‌జిమ్‌ ప్రారంభించి జిమ్‌ చేస్తున్న విప్‌ బాల్క సుమన్‌

మందమర్రిటౌన్‌, జనవరి 20: ప్రజారోగ్యమే  లక్ష్యం గా ఓపెన్‌జిమ్‌లను ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ తెలిపారు. గురువారం పట్టణంలో రూ.43 లక్షలతో ప్రాణహిత కాలనీ, శ్రీపతినగర్‌, యాపల్‌ ఏరియాల్లో ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌లను జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీఓదెలుతో కలిసి ప్రారంభించారు. విప్‌ మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. రూ. 45 కోట్లతో మిషన్‌ భగీరథ పైపులైన్‌ పనులు తుది దశకు చేరా యన్నారు. వేగవంతంగా ప్రజా సంక్షేమానికి, అభివృ ద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. మాజీ విప్‌ నల్లాల ఓదెలు, మున్సిపల్‌ కమిషనర్‌ రాజు, జడ్పీటీసీ వేల్పుల రవి, టీఆర్‌ఎస్‌ నాయకులు మేడిపల్లి సంపత్‌, బడికెల సంపత్‌, బత్తుల శ్రీనివాస్‌, కనకం రవీందర్‌, మేడిపల్లి మల్లేష్‌, ముస్తాఫా పాల్గొన్నారు. 

ఫ పట్టణంలోని శ్రీపతినగర్‌, దీపక్‌నగర్‌కు చెందిన యువకులు యువ నాయకుడు వైద్యం ప్రసాద్‌ ఆధ్వ ర్యంలో గురువారం రాత్రి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి సుమన్‌ పార్టీలోకి ఆహ్వానిం చారు. విప్‌ మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తామన్నారు.  గిరి పాల్గొన్నారు.

ఐటీఐ కళాశాల చుట్టూ ప్రహారీ నిర్మించాలి

పట్టణంలో రూ.5 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ ఐటీ ఐ కళాశాల చుట్టూ ప్రహారీ గోడను నిర్మించాలని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌కు కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు వినతి పత్రం అందించారు. 

గ్రామాల అభివృద్ధికి పెద్దపీట 

మందమర్రిరూరల్‌: గ్రామాల అభివృద్ధికి ప్రభు త్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్‌ బాల్క సుమ న్‌ పేర్కొన్నారు. వెంకటాపూర్‌, మామిడిగట్టులో వైకుం ఠధామం, కంపోస్టుషెడ్‌, పంచాయతీ కార్యాలయాన్ని జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీఓదెలుతో  కలిసి ఆయన ప్రారంభించారు. విప్‌ మాట్లాడుతూ గ్రామాల ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలతో ముందుకు వెళ్తుందన్నారు. మహిళా సంఘాల భవనాల కోసం రూ. 7.50 కోట్లతో సమ్మక్క సారలమ్మ భవనాలను నిర్మిస్తామని పేర్కొన్నారు. వెంకటాపూర్‌, లేమూరులోని దొమ్మరి వాగుపై బ్రిడ్జి నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రతీ గ్రామంలో రూ.4 లక్షలతో గ్రంథాలయం ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.  గ్రంథాలయాల్లో బాల్క ఫౌండే షన్‌ ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు మెటీరియల్‌ను అందుబాటులో ఉంచుతామన్నారు. మామిడిగట్టులో జూలైలోగా హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు చేస్తామని సూచించారు. ఎంపీపీ గుర్రం మంగ శ్రీని వాస్‌గౌడ్‌, వెంకటాపూర్‌ గ్రామ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు వేల్పుల సాగర్‌, సర్పంచులు కుమ్మరి తిరుపతి, కోట రాయలింగు, కొమురయ్య, తిరుపతిరెడ్డి, పున్నం, ఎంపీ డీవో ప్రవీణ్‌కుమార్‌, ఎంపీవో షేక్‌ సప్దర్‌ ఆలీ, ఏపీవో రజియాసుల్తానా, నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-21T04:00:29+05:30 IST