Abn logo
Mar 5 2021 @ 00:08AM

పాఠశాలను తనిఖీ చేసిన ఓపెన్‌ స్కూల్‌ జేడీ

బోథ్‌రూరల్‌, మార్చి 4: మండలంలోని ధన్నూర్‌(బి)లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలను, ప్రాథమిక పాఠశాలలను ఓపెన్‌ స్కూల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ సోమిరెడ్డి, డీఈవో రవీంద్‌రెడ్డితో కలిసి గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు కరోనా నేపథ్యంలో పాఠశాలలో అమలవుతున్న నియమాలను పరిశీలించారు. విద్యార్థులు భౌతికదూరం పాటిస్తూ మాస్కులు ధరించాలన్నారు. క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరుకావాలన్నారు. శ్రద్ధగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులకు పలు సూచనలను చేశారు.  ఇందులో ఓపెన్‌ స్కూల్‌ కో ఆర్డినేటర్‌ అశోక్‌, స్పెషల్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఎంఈవో భూమారెడ్డి, ఉపాధ్యాయుడు బైరి సతీష్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement