పాస్‌వర్డ్‌ లేకుండా పీడీఎఫ్‌ ఫైల్‌ ఓపెన్‌

ABN , First Publish Date - 2021-07-17T06:16:47+05:30 IST

పీడీఎఫ్‌ ఫైల్‌ ఓపెన్‌ చేయాలంటే పాస్‌వర్డ్‌ చాలా సార్లు అవసరం. అయితే నిజంగా ఈ ప్రక్రియ తలనొప్పే. మాటిమాటికి పాస్‌వర్డ్‌ అని అడుగుతుంటే చిరాకు పుడుతుంది కూడా.

పాస్‌వర్డ్‌ లేకుండా పీడీఎఫ్‌ ఫైల్‌ ఓపెన్‌

పీడీఎఫ్‌ ఫైల్‌ ఓపెన్‌ చేయాలంటే పాస్‌వర్డ్‌ చాలా సార్లు అవసరం. అయితే నిజంగా ఈ ప్రక్రియ తలనొప్పే. మాటిమాటికి పాస్‌వర్డ్‌ అని అడుగుతుంటే చిరాకు  పుడుతుంది కూడా. అయితే, పీడీఎఫ్‌ పాస్‌వర్డ్‌ రిమూవర్‌ ఆన్‌లైన్‌ ఫ్రీ అలాగే పెయిడ్‌ వెర్షన్‌ లభ్యమవుతున్నాయి. వాటిని ఎలా ఉపయోగించాలో చూడండి.


పాస్‌వర్డ్‌ తొలగింపు

షేరింగ్‌ ముందే మాన్యువల్‌గా పీడీఎఫ్‌ పాస్‌వర్డ్‌ను తొలగించవచ్చు. అలాంటి ఫైల్‌ను పంపగలిగితే పాస్‌వర్డ్‌ లేకుండానే అవి ఓపెన్‌ అవుతాయి. అయితే ఒరిజినల్‌ పాస్‌వర్డ్‌ తెలిస్తేనే రిమూవ్‌ చేయగలుగుతాం. 


గూగుల్‌ క్రోమ్‌ ద్వారా తొలగింపు

గూగుల్‌ క్రోమ్‌ ఉపయోగించి మొదట ఫైల్‌ ఓపెన్‌ చేయాలి. డీఫాల్ట్‌ పీడీఎఫ్‌ అప్లికేషన్‌కు బదులుగా అన్‌లాక్‌ చేసేందుకు పాస్‌వర్డ్‌ టైప్‌ చేయాలి. 

అన్‌లాక్‌ అయిన తరవాత విండోస్‌పై కంట్రోల్‌ + పి లేదా మేక్‌ ఓఎస్‌పై  సీఎండీ + పి ప్రెస్‌ చేసి ‘ప్రింట్‌’ డయలాగ్‌ బాక్స్‌ను తెచ్చుకోవాలి.  

డిఫాల్ట్‌ ప్రింటర్‌ను ఎంపిక చేసుకునేందుకు బదులు సేవ్‌ యాజ్‌ పీడీఎఫ్‌ లేదా ప్రింట్‌ టు పీడీఎఫ్‌ ఆప్షన్‌ని చూడండి. ఇతర ఆధునిక బ్రౌజర్లపైనా ఈ పద్ధతిని ట్రై చేయవచ్చు. 


అడోబ్‌ ఆక్రోబాట్‌ డీసీపై(సబ్‌స్ర్కిప్షన్‌ అవసరం)

ఆక్రోబాట్‌ డీసీకి సబ్‌స్ర్కిప్షన్‌ అవసరమవుతుంది. ఒకసారి సబ్‌స్ర్కిప్షన్‌ లేదా తీసుకుంటే ట్రయల్‌ కోసం రిజిస్టర్‌ అయితే మొదట ఆక్రోబాట్‌ డీసీ యాప్‌ని ఓపెన్‌ చేయాలి.

టూల్స్‌ మెనూకు వెళ్ళి ప్రొటెక్ట్‌పై క్లిక్‌ చేయాలి. తదుపరి ఎన్‌క్రిప్ట్‌ చేయాలి. రిమూవ్‌ సెక్యూరిటీపై క్లిక్‌ చేయాలి. 

రిమూవ్‌ చేసేందుకు ముందు పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయాలి. పర్మిషన్స్‌ పాస్‌వర్డ్‌ అయితే మళ్ళీ ఎంటర్‌ చేసి ఒకేని రెండు సార్లు క్లిక్‌ చేసి పీడీఎఫ్‌ పాస్‌వర్డ్‌ను తొలగించాలి. 


ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఉపయోగించి

బిల్ట్‌-ఇన్‌ పీడీఎఫ్‌ వ్యూయర్‌ ఉపయోగించి పీడీఎఫ్‌ను ఓపెన్‌ చేయాలి. ఫైల్‌ను అన్‌లాక్‌ చేసేందుకు పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయాలి. 

- మెనూ ఐకాన్‌ను టాప్‌ చేయాలి. షేర్‌ను టాప్‌ ఆన్‌ చేసి ఫ్రింట్‌ ఐకాన్‌ను కనుగొనాలి. ‘ప్రింట్‌ టు పీడీఎఫ్‌’గా డెస్టినేషన్‌ను స్పెసిఫై చేయాలి. తద్వారా అదే లొకేషన్‌లో పాస్‌వర్డ్‌ లేకుండా ఫైల్‌ సేవ్‌ చేసుకోవాలి. 

- సేవ్‌ టాప్‌ చేస్తే ఫోన్‌లోని ఇంటర్నల్‌ స్టోరేజ్‌ దగ్గరకు వెళుతుంది. ఇప్పుడు ఇక పాస్‌వర్డ్‌ లేకుండానే సేవ్‌ చేయవచ్చు.

Updated Date - 2021-07-17T06:16:47+05:30 IST