ముఖం చూపించి లాక్ ఓపెన్ చేయండి.. యూఎస్ కాపిటోల్ దాడి కేసులో కోర్టు ఆదేశం

ABN , First Publish Date - 2021-07-28T08:26:06+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో దుమారం రేపిన యూఎస్ కాపిటోల్ దాడి గురించి తెలిసిందే. ఈ దాడిలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి తన ముఖం చూపించి ల్యాప్‌టాప్ లాక్ ఓపెన్ చేయాలని

ముఖం చూపించి లాక్ ఓపెన్ చేయండి.. యూఎస్ కాపిటోల్ దాడి కేసులో కోర్టు ఆదేశం

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో దుమారం రేపిన యూఎస్ కాపిటోల్ దాడి గురించి తెలిసిందే. ఈ దాడిలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి తన ముఖం చూపించి ల్యాప్‌టాప్ లాక్ ఓపెన్ చేయాలని అమెరికాలోని ఒక కోర్టు జడ్జి ఆదేశించారు. కాపిటోల్ దాడికి సంబంధించిన సమాచారం సదరు ల్యాప్‌టాప్ ఉండే అవకాశం ఉందని ప్రాసిక్యూటర్లు వాదించారు. ఈ నేపథ్యంలోనే నిందితుడు గయ్ రెఫ్పిట్‌ను అతని ల్యాప్‌టాప్ ముందు కూర్చోబెట్టడానికి, ఆపై ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ల్యాప్‌టాప్ లాక్ ఓపెన్ చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చింది.

Updated Date - 2021-07-28T08:26:06+05:30 IST