ఆరోగ్యం కోసం ఓపెన్‌ జిమ్‌ సెంటర్లు

ABN , First Publish Date - 2021-07-28T05:45:26+05:30 IST

ప్రతి ఒక్కరూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందేందుకు ప్రభుత్వం ఓపెన్‌ జిమ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు.

ఆరోగ్యం కోసం ఓపెన్‌ జిమ్‌ సెంటర్లు
చిలుకూరులో ఓపెన్‌ జిమ్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌

చిలుకూరు / కోదాడ, జూలై 27 : ప్రతి ఒక్కరూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందేందుకు ప్రభుత్వం ఓపెన్‌ జిమ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేయనున్న ఓపెన్‌ జిమ్‌ సెంటర్‌కు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌ నిధులు రూ.25 లక్షలతో కోదాడ నియోజకవర్గంలో ఐదు జిమ్‌ సెంటర్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా చిలుకూరులో రూ.5 లక్షలతో ఓపెన్‌ జిమ్‌ నిర్మిస్తున్నామన్నారు. అనంతరం మక్కెన స్వాతి ఇటీవల కరోనాతో మృతి చెందగా కుటుంబసభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్‌ కొండా సైదయ్య, సొసైటీ చైర్మన్‌ జనార్థన్‌, దొడ్డా సురేష్‌, కస్తూరి నర్సయ్య, బట్టు శివాజీ, సర్పంచ్‌ కొడారు బాబు, ఎంపీటీసీ రమణ నాగయ్య, పాష, వీరబాబు, శరత్‌, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కోదాడ పట్టణంలో ఓపెన్‌జిమ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో బుర్ర సుధారాణిపుల్లారెడ్డి, పద్మామధు, కమిషనర్‌ నాగేంద్రబాబు, నాగేశ్వరరావు, సైదయ్య, మదర్‌, ఉపేందర్‌, రామారావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-28T05:45:26+05:30 IST