విద్యామంత్రిత్వ శాఖ నుంచి ఐఓఈ హోదాను అందుకున్న ఓపీ జిందాల్‌ గ్లోబల్‌ వర్శిటీ

ABN , First Publish Date - 2020-11-01T00:24:22+05:30 IST

విద్యామంత్రిత్వ శాఖ నుంచి ఐఓఈ హోదాను అందుకున్న ఓపీ జిందాల్‌ గ్లోబల్‌ వర్శిటీ

విద్యామంత్రిత్వ శాఖ నుంచి ఐఓఈ హోదాను అందుకున్న ఓపీ జిందాల్‌ గ్లోబల్‌ వర్శిటీ

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖ నుంచి ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌ (ఐఓఈ) హోదాను ఓపీ జిందాల్‌ గ్లోబల్‌ యూనివర్శిటీ అందుకుంది. జేజీయూకు ఇది చారిత్రాత్మక గుర్తింపు. ఐఓఈ నిబంధనలకు అనుగుణంగా అన్ని చట్టపరమైన, నియంత్రణ మరియు విధానపరమైన అవసరాలన్నీ కూడా జేజీయూ అనుసరించింది. తద్వారా జేజీయూ ఇప్పుడు ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌ (ఐఓఈ)గా కార్యకలాపాలు నిర్వహించనుంది.


ప్రపంచస్థాయి బోధన మరియు పరిశోధనా సంస్ధలుగా మారడానికి విశ్వ విద్యాలయాలు మరియు ఉన్నత విద్యా సంస్థలను శక్తివంతం చేయడంలో భారత ప్రభుత్వ నిబద్ధతను అమలు చేసేందుకు ఈ ఐఓఈ విధానాన్ని ప్రారంభించారు. ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌ ఎంపిక మరియు సిఫార్సు బాధ్యతను నిపుణుల కమిటీకి అప్పగించారు. ఈ కమిటీని గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నియమిస్తారు.


ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ ఎమినెస్స్‌ హోదాతో జేజీయూ ఇప్పుడు దేశంలోని ప్రతిష్టాత్మక 10 ప్రైవేట్‌ ఇనిస్టిట్యూషన్‌ల బృందంలో ప్రవేశించడంతో పాటుగా నియంత్రణ పరిధిలకు పూర్తి స్వతంత్య్ర ప్రతిపత్తిని ఆస్వాదిస్తుంది. ‘‘ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌గా హోదాను జేజీయూ అందుకోవడం పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నానని వ్యవస్థాపక ఛాన్స్‌లర్‌ మరియు ఓ.పీ జిందాల్‌ గ్లోబల్‌ యూనివర్శిటీ శ్రేయోభిలాషి నవీన్‌ జిందాల్‌ తెలిపారు. జేజీయూకు ఇది అసాధారణ గుర్తింపు మరియు విశ్వవిద్యాలయం సాధించిన అసాధారణ విజయాలకు మహోన్నత నివాళి ఇది అని, జేజీయూను తమ తండ్రి ఓ.పీ జిందాల్‌ స్మృత్యర్థం ఏర్పాటు చేశామని చెప్పారు. 

Updated Date - 2020-11-01T00:24:22+05:30 IST