ఊరగుట్ట గుల్ల

ABN , First Publish Date - 2022-09-29T05:03:19+05:30 IST

పుల్లగూర గండి వద్ద ఉన్న ఊరగుట్టను కొందరు కబ్జాదారులు రెవె న్యూ అధికారుల సహకారంతో యథేచ్ఛగా ఎక రాలకు ఎకరాల భూమిని చదును చేసి మామి డి మొక్కలు నాటుతున్నారు. గతంలో ప్రభుత్వ భూమిగా రెవెన్యూ అధికారులు బోర్డు నాటినా అధికార పార్టీ నేతల అండదండలతో కబ్జాదారు లు పేట్రేగిపోతున్నారు.

ఊరగుట్ట గుల్ల
మొక్కలు నాటడానికి సిద్దంగా ఉంచిన భూమి

గుట్టుచప్పుడు కాకుండా కొల్లగొడుతున్న భూ బకాసురులు
దిగువరాచపల్లెలో యథేచ్ఛగా కబ్జా
నాడు ప్రభుత్వ భూమి అంటూ బోర్డు ఏర్పాటు
నేడు రెవెన్యూ సహకారంతో రెచ్చిపోతున్న కబ్జాదారులు
వీరబల్లి, సెప్టెంబరు28:
పుల్లగూర గండి వద్ద ఉన్న ఊరగుట్టను కొందరు కబ్జాదారులు రెవె న్యూ అధికారుల సహకారంతో యథేచ్ఛగా ఎక రాలకు ఎకరాల భూమిని చదును చేసి మామి డి మొక్కలు నాటుతున్నారు. గతంలో ప్రభుత్వ భూమిగా రెవెన్యూ అధికారులు బోర్డు నాటినా అధికార పార్టీ నేతల అండదండలతో కబ్జాదారు లు పేట్రేగిపోతున్నారు. వివరాల్లోకెళితే....
 అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం దిగువరాచపల్లె పంచాయతీలోని పుల్లగూర గండి వద్ద ఉన్న ఊరగుట్టను చదును చేసి ఆక్ర మిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తూ గతంలో రెవెన్యూ అధికారులు సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆ ప్రాంతం వైపు కన్నెత్తి చూడని కబ్జాదారులు ప్రస్తుత రెవె న్యూ అధికారులతో కుమ్మక్కై గుట్టను రాత్రికి రాత్రే ఎక్స్‌కవేటర్‌తో చదును చేసి ట్రాక్టర్లతో దున్ని దుక్కి చేశారు. అంతేగాకుండా ఆ స్థలం లోనే మామిడి మొక్కలను నాటేందుకు సన్న ద్ధం అవుతున్నారు. మరికొందరు ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టిన చోట కూడా మామి డి మొక్కలు నాటారు. ఇంత భారీ మొత్తంలో ఊరగుట్టను చదును చేసి కబ్జా చేస్తుంటే అటు రెవెన్యూ, ఇటు గ్రామ సచివాలయ అధికారులు కానీ పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు  వినిపిస్తున్నాయి. ఈవిషయమై ప్రజలు జిల్లా ఉన్నతాధికారులను కలిసే అవకాశం ఉంది.

Updated Date - 2022-09-29T05:03:19+05:30 IST