ఒంటిమిట్ట ఎంపీడీవో పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు సరెండర్‌

ABN , First Publish Date - 2021-07-25T06:09:30+05:30 IST

ఒంటిమిట్ట ఎంపీడీవో క్రిష్ణయ్యను శనివారం పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు సరెండర్‌ చేశారని జడ్పీ సీఈవో సుధాకర్‌ తెలిపారు. ఎంపీడీవో క్రిష్ణయ్య విధినిర్వహణ సరిగాలేదని పలుమార్లు కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లాయన్నారు.

ఒంటిమిట్ట ఎంపీడీవో పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు సరెండర్‌

కడప రూరల్‌, జూలై 24 : ఒంటిమిట్ట ఎంపీడీవో క్రిష్ణయ్యను శనివారం పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు సరెండర్‌ చేశారని జడ్పీ సీఈవో సుధాకర్‌ తెలిపారు. ఎంపీడీవో క్రిష్ణయ్య విధినిర్వహణ సరిగాలేదని పలుమార్లు కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లాయన్నారు. బాధ్యతగా విధులు నిర్వర్తించాలని హెచ్చరించినా ఆయన తీరులో మార్పు లేదన్నారు. రాజంపేట సబ్‌కలెక్టర్‌తో పాటు జడ్పీ శాఖ కూడా ఎంపీడీవో క్రిష్ణయ్య పనితీరు సరిగాలేదని ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులోను, వ్యాక్సినేషన్‌లోను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్‌కు వేరువేరుగా రిపోర్టులు ఇచ్చారన్నారు. దీంతో ఆయనను పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌కు కలెక్టర్‌ సరెండర్‌ చేశారన్నారు.


పలువురు తహశీల్దార్ల బదిలీ

కడప(కలెక్టరేట్‌) జూలై 24. జిల్లాలో పలువురు తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్‌ సి.హరికిరణ్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీర్ఘకాలిక సెలవులో ఉన్న పుల్లంపేట తహశీల్దారు ఉమామహేశ్వరరావును సుండుపల్లికి బదిలీ చేశారు. వల్లూరు తహశీల్దారు ఎన.ఆంజనేయులును లింగాలకు, అక్కడ పనిచేస్తున్న ఈ.ప్రతాప్‌రెడ్డిని కడప సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలోని కేఆర్‌సీసీకి, చక్రాయపేట తహశీల్దారు వైఎస్‌ సత్యానందంను చిట్వేల్‌కు, నందలూరు తహశీల్దారు బి.శ్రీరాములునాయక్‌ను ముద్దనూరుకు, సంబేపల్లి తహశీల్దారు సి.నరసింహులును పుల్లంపేటకు బదిలీ చేశారు. అలాగే గత నెలలో తహశీల్దార్లుగా పదోన్నతి పొందిన 8 మంది డీటీలకు కూడా పోస్టింగులు ఇచ్చారు.

Updated Date - 2021-07-25T06:09:30+05:30 IST