సచిన్ మాత్రమే మిగిలాడు: కాంగ్రెస్‌పై నెటిజెన్ల ట్రోల్స్

ABN , First Publish Date - 2022-01-26T00:14:28+05:30 IST

రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులుగా పేరొందని నేతలు ఒకరి తర్వాత మరొకరు వరుసపెట్టి బీజేపీలో చేరుతుండడం. జ్యోతిరాదిత్య సిందియా, జితిన్ ప్రసాద కొద్ది కాలం క్రితమే బీజేపీలో చేరారు. తాజాగా ఆర్‌పీఎన్ సింగ్ సైతం కమల తీర్థం పుచ్చుకున్నారు...

సచిన్ మాత్రమే మిగిలాడు: కాంగ్రెస్‌పై నెటిజెన్ల ట్రోల్స్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆర్‌పీఎన్‌ సింగ్ బీజేపీలో చేరిన అనంతరం సచిన్‌ పైలట్‌పై కాంగ్రెస్ పార్టీపై నెటిజెన్లు పెద్ద ఎత్తున ట్రోల్స్ వేస్తున్నారు. కారణం.. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులుగా పేరొందని నేతలు ఒకరి తర్వాత మరొకరు వరుసపెట్టి బీజేపీలో చేరుతుండడం. జ్యోతిరాదిత్య సిందియా, జితిన్ ప్రసాద కొద్ది కాలం క్రితమే బీజేపీలో చేరారు. తాజాగా ఆర్‌పీఎన్ సింగ్ సైతం కమల తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ‘రాహుల్ టీంలో మిగిలింది ఇక సచిన్ పైలట్ ఒక్కడే’ అంటూ జోకులు వేస్తున్నారు. ఈ నలుగురి ఫొటోలు షేర్ చేస్తూ ‘‘ఇక సచిన్ వంతు’’, ‘‘సచిన్ పైలట్ వస్తే రాహుల్ టీం సమాప్తం అవుతుంది’’ అని కొన్ని ‘‘నువ్వు కూడా వచ్చెయ్ సచిన్’’ అని సిందియా అన్నట్లుగా మరికొందరు మీమ్స్ వేస్తున్నారు.


నిజానికి 2020 జూలైలోనే కాంగ్రెస్ పార్టీపై సచిన్ పైలట్ తిరుగుబాటు చేశారు. తనకు విధేయులైన 18 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై సచిన్ తిరుగుబాటుకు దిగారు. పైలట్ బీజేపీలోకి వస్తారనే బలమైన ఊహాగానాలు చెలరేగాయి. అయితే రాజస్తాన్ అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో పైలట్ మద్దతు లేకుండానే గెహ్లాట్ ప్రభుత్వం విజయం సాధించడంతో పైలట్ చల్లబడ్డారు. తాను బీజేపీలో చేరనున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తమని చెప్పారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌తో చర్చల అనంతరం మళ్లీ హస్తం పార్టీలోనే కొనసాగుతున్నారు.


ట్విట్టర్‌లో నెటిజెన్లు వేస్తున్న ట్రోల్స్‌లో కొన్ని..



















Updated Date - 2022-01-26T00:14:28+05:30 IST