అనంతపురం(విద్య): అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కేవీఎస్ నగర్‌లోని ఎంపీపీ పాఠశాలకు తొలిరోజు ఒకే ఒక విద్యార్థి హాజరయ్యాడు. ఈ పాఠశాలలో కింది గదిలో 1, 2, 3 తరగతులు, పైగదిలో 4, 5 తరగతులను నిర్వహిస్తున్నారు. విద్యా సంవత్సర పునః ప్రారభానికి ప్రభుత్వం ‘మంగళవారాన్ని’ ఎంపిక చేసుకోవడంతో ఆ ప్రభావం హాజరుపై పడింది. ఈ పాఠశాలలో 1, 2, 3 తరగతులకు కలిపి రెండో తరగతి విద్యార్థి ఒక్కడే హాజరయ్యాడు.