ఢిల్లీ మెట్రోలో బోగీకి 50 మంది చొప్పున మాత్రమే అనుమతి

ABN , First Publish Date - 2021-07-25T21:18:10+05:30 IST

ఢిల్లీ మెట్రో రైళ్లలో ఒక్కొక్క బోగీకి కేవలం 50 మంది

ఢిల్లీ మెట్రోలో బోగీకి 50 మంది చొప్పున మాత్రమే అనుమతి

న్యూఢిల్లీ : ఢిల్లీ మెట్రో రైళ్లలో ఒక్కొక్క బోగీకి కేవలం 50 మంది ప్రయాణికులను మాత్రమే అనుమతించనున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ప్రకటించింది. నిల్చుని ప్రయాణించేందుకు అనుమతి లేదని వివరించింది. కోవిడ్-19 మహమ్మారికి పూర్వం ప్రతి బోగీకి 300 మంది చొప్పున ప్రయాణికులను అనుమతించేవారు. 


కచ్చితంగా అవసరమైనపుడు మాత్రమే మెట్రో రైలులో ప్రయాణించాలని ప్రయాణికులను డీఎంఆర్‌సీ కోరింది. ప్రయాణం సందర్భంగా కోవిడ్ సంబంధిత మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. 


ఢిల్లీ మెట్రో రైళ్లు, ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సుల సేవలు సోమవారం ఉదయం 5 గంటల నుంచి పునఃప్రారంభమవుతాయి. దీనికి సంబంధించిన ఆదేశాలను ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ శనివారం జారీ చేసింది. 


Updated Date - 2021-07-25T21:18:10+05:30 IST