మాస్క్‌లు ధరిస్తున్న వారు 44 శాతమే

ABN , First Publish Date - 2020-09-25T06:50:04+05:30 IST

‘అప్నా మాస్క్‌’ పేరిట ఏక్‌ దేశ్‌ స్వచ్ఛంద సంస్థ 18 నగరాల్లో నిర్వహించిన సర్వేలో మాస్క్‌లు ధరిస్తున్నవారు 44 శాతమేనని తేలింది...

మాస్క్‌లు ధరిస్తున్న వారు 44 శాతమే

దేశంలోని 18 నగరాల్లో నిర్వహించిన సర్వేలో స్పష్టం


న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: కరోనా వ్యాప్తి నిరోఽధంలో కీలకమైనవి మాస్క్‌ల ధారణ, భౌతిక దూరం, చేతుల శుభ్రత. దేశం పూర్తి అన్‌లాక్‌ అవుతున్న దశలో ఈ జాగ్రత్తలు మరింత ముఖ్యమైనవి. అయితే ‘అప్నా మాస్క్‌’ పేరిట ఏక్‌ దేశ్‌ స్వచ్ఛంద సంస్థ 18 నగరాల్లో నిర్వహించిన సర్వేలో మాస్క్‌లు ధరిస్తున్నవారు 44 శాతమేనని తేలింది. మాస్క్‌తో శ్వాసకు ఇబ్బంది అని 50 శాతం మంది చెప్పగా, అసౌకర్యమని 44 శాతం మంది అన్నారు. వైరస్‌ నిరోధానికి భౌతిక దూరం పాటిస్తే సరిపోతుందనే భావనలో 45 శాతం మంది ఉన్నారు. ఇలాంటివారిలో 26 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యవారు ఎక్కువని, వీరు కరోనాకు అతీతులమన్న ఆలోచనలో ఉన్నారని సర్వే తెలిపింది. 36-55 ఏళ్ల మధ్య వారు మాత్రం మాస్క్‌ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారని పేర్కొంది. పురుషుల కంటే మహిళలే ఎక్కువ చైతన్యంతో ఉన్నారని సర్వే వివరించింది. ‘ఏ కార్యక్రమంలోనూ నేను మాస్క్‌ పెట్టుకోను. అయితే ఏంటట?’ అని నోరుజారిన మధ్యప్రదేశ్‌ హోం మంత్రి నరోత్తం మిశ్రా తర్వాత నాలుక్కర్చుకున్నారు. 

Updated Date - 2020-09-25T06:50:04+05:30 IST