Advertisement
Advertisement
Abn logo
Advertisement

పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌ల్లో కేంద్రం వాటా 26 శాతమే... త్వరలో కొత్త చట్టం...

న్యూఢిల్లీ : వివిధ కారణాల నేపధ్యంలో బ్యాంకుల ప్రవేటీకరణకు సంబంధించి... కేంద్రం తన వాటాను విక్రయించే విషయంలో మార్పులు తీసుకురానుంది. బ్యాంకుల్లో వాటాను కనీసం 26 శాతాన్ని కొనసాగించనున్నట్లు చెబుతోంది. ప్రభుత్వానికి ప్రస్తుతం అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 51 శాతం వాటా ఉంటోన్న విషయం తెలిసిందే. అంటే... 1970 ల నాటి బ్యాంకింగ్ కంపెనీల చట్టం ప్రకారం ఇది కొనసాగుతుంది. అయితే...  బ్యాంకింగ్ లాస్‌ అమెండ్‌మెంట్ బిల్ 2021 ప్రకారం... కనీస వాటా 26 శాతానికి తగ్గించనుంది. దీనికి పైన మాత్రం తగ్గే అవకాశముండదు. ఈ మేరకు చట్టం రూపుదిద్దుకోనుంది. బ్యాంకుల ప్రవేటీకరణ గురించి ఆర్‌బీఐతో చర్చల తర్వాత ఈ చట్టానికి సవరణలు చేయనుంది. అంతేకాకుండా... ఇదే  బిల్లులో బ్యాంకుల హోల్ టైమ్ డైరక్టర్ల జీతం, రిస్క్ టేకింగ్ చర్యలు, డైరెక్టర్ల పదవీవిరమణ అంశాలపై కూడా కేంద్రం పలు ప్రతిపాదనలను చేర్చనుంది. 

Advertisement
Advertisement