Shocking : దళితబంధు తొలి లబ్ధిదారులు 15 మందేనట...

ABN , First Publish Date - 2021-08-14T18:36:41+05:30 IST

హుజూరాబాద్‌లో ధళిత బంధు తొలి లబ్దిదారులుగా 15 మందిని ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈనెల 16 వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు హుజురాబాద్ నియోజకవర్గంలోని..

Shocking : దళితబంధు తొలి లబ్ధిదారులు 15 మందేనట...

కరీంనగర్ : హుజూరాబాద్‌లో దళిత బంధు తొలి లబ్ధిదారులుగా 15 మందిని ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈనెల 16 వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం శాలపల్లి గ్రామం బహిరంగ సభ వేదికగా 15 మంది దళితులకు తెలంగాణ దళితబంధు పథకం చెక్కులను సీఎం కేసీఆర్ అందజేయనున్నారు. లబ్ధిదారుల ఎంపికపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇవాళ రాత్రి వరకూ జాబితా ఖరారు చేయనున్నారు. జాబితాను రేపు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జిల్లా కలెక్టర్ కర్ణన్ పంపనున్నారు. సీఎం ఆమోదంతో తొలి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నారు. మరోవైపు అందరికీ దళితబంధు ఇవ్వాల్సిందేనని హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు రెండు రోజులుగా ధర్నా చేస్తున్నారు. దళిత బంధును అర్హులకు ఇవ్వడం లేదంటూ మండిపడుతున్నారు.

Updated Date - 2021-08-14T18:36:41+05:30 IST