‘టోక్యో’లో 10,000 మందికే ఎంట్రీ

ABN , First Publish Date - 2021-06-22T05:57:12+05:30 IST

ఒలింపిక్స్‌ ప్రత్యక్ష వీక్షణకు స్థానిక అభిమానులను పరిమిత సంఖ్యలో అనుమతించనున్నట్టు టోక్యో

‘టోక్యో’లో 10,000 మందికే ఎంట్రీ

టోక్యో: ఒలింపిక్స్‌ ప్రత్యక్ష వీక్షణకు స్థానిక అభిమానులను పరిమిత సంఖ్యలో అనుమతించనున్నట్టు టోక్యో నిర్వాహకులు తెలిపారు. స్టేడియం కెపాసిటీలో 50 శాతం.. గరిష్ఠంగా పదివేల మందికి ఎంట్రీ లభించనుంది. ఈ మేరకు జపాన్‌ ప్రభుత్వం, అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐవోసీ), టోర్నీ నిర్వాహకులు, ఇతర భాగస్వామ్య పక్షాలు చర్చించి నిర్ణయం తీసుకున్నాయి. వచ్చేనెల 23న ఒలింపిక్స్‌ ఆరంభం కానున్నాయి. కరోనా కారణంగా అత్యవసర పరిస్థితులు తలెత్తితే ఈ నిర్ణయంపై పునః సమీక్ష చేస్తామని నిర్వాహకులు తెలిపారు. జపాన్‌లో కరోనా తీవ్రత కొద్దిగా తగ్గడంతో కొన్ని కఠిన నిబంధనలను ప్రభుత్వం సడలించింది. కాగా, విదేశీ అభిమానుల ఎంట్రీపై ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2021-06-22T05:57:12+05:30 IST