వివిధ అంశాల్లో ఆన్‌లైన్‌లో శిక్షణ

ABN , First Publish Date - 2020-08-10T10:39:52+05:30 IST

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎన్‌ఎస్‌ఈ అకాడమీ లిమిటెడ్‌ సంయుక్త ఆధ్వర్యంలో వివిధ కళాశాలల అధ్యాపకులకు, గృహిణులకు కొవిడ్‌-19 ..

వివిధ అంశాల్లో ఆన్‌లైన్‌లో శిక్షణ

నరసన్నపేట, ఆగస్టు 9: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎన్‌ఎస్‌ఈ అకాడమీ లిమిటెడ్‌ సంయుక్త ఆధ్వర్యంలో వివిధ కళాశాలల అధ్యాపకులకు, గృహిణులకు కొవిడ్‌-19 పరిస్థితుల్లో ఆన్‌లైన్‌లో మూలధన మార్కెట్‌ మరియు వ్యక్తిగత ఫైనాన్స్‌పై వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్ధ అధికారి ఎన్‌.గోవిందరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కళాశా లల్లో పనిచేసే అధ్యాపకుల కోసం నాలుగు రోజుల పాటు రోజుకు 2 గంటలు చొప్పున  మూలధన మార్కెట్లపై అవగాహన కల్పించనున్నామన్నారు. డిగ్రీ పూర్తి చేసిన గృహిణుల కోసం వ్యక్తిగత ఫైనాన్స్‌పై మూడు రోజులు,  రోజుకు రెండు గంటల పాటు ఆన్‌లైన్‌లో వర్క్‌షాప్‌ నిర్వహిస్తామన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈనెల 15వ తేదీ లోగా ఏపీఎస్‌ఎస్‌డీఎస్‌ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేయించుకోవాలని సూచించారు. 

Updated Date - 2020-08-10T10:39:52+05:30 IST