రేపటినుంచి టీచర్లకు ఆన్‌లైన్‌ ట్రైనింగ్‌ కోర్సులు

ABN , First Publish Date - 2021-05-06T06:16:38+05:30 IST

సమగ్రశిక్షా ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రాథమిక తరగతులు బోధించే టీచర్లకు శుక్రవారం నుంచి దీక్షా యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ ట్రైనింగ్‌ కోర్సులు నిర్వహించనున్నట్లు ఏపీసీ వెంకటరమణారెడ్డి తెలిపారు.

రేపటినుంచి టీచర్లకు ఆన్‌లైన్‌ ట్రైనింగ్‌ కోర్సులు

చిత్తూరు (సెంట్రల్‌), మే 5: సమగ్రశిక్షా ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రాథమిక తరగతులు బోధించే టీచర్లకు శుక్రవారం నుంచి  దీక్షా యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ ట్రైనింగ్‌ కోర్సులు నిర్వహించనున్నట్లు ఏపీసీ వెంకటరమణారెడ్డి తెలిపారు. ఈ మేరకు సమగ్రశిక్షా ఎస్పీడీ వెట్రిసెల్వి ఇచ్చిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. శుక్రవారం నుంచి జూన్‌ 1వ తేదీ వరకు రోజూ సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు ట్రైనింగ్‌ ఉంటుందన్నారు. కోర్స్‌-1లో ఓరియంటేషన్‌ ఆన్‌ న్యూ టెక్స్ట్‌బుక్స్‌పై శుక్రవారం నుంచి 22వ తేదీ వరకు, కోర్సు-2లో వీ లవ్‌ రీడింగ్‌ అంశంపై  23 నుంచి 28 వరకు, కోర్సు-3లో దీక్షా కాంటెంట్‌ క్రియేషన్‌పై 29 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ట్రైనింగ్‌ ఉంటుందన్నారు.

Updated Date - 2021-05-06T06:16:38+05:30 IST