సోఫాసెట్‌ కొనడానికి చాటింగ్‌ చేసి రూ. 1.45 లక్షలు కొట్టేశాడు

ABN , First Publish Date - 2022-07-04T06:31:41+05:30 IST

మోసాలు కొత్త పుంతలు తొక్కుతు న్నాయి. ఏ వైపు ఎలా మోసపోతామో తెలియడం లేదు.. మోసపోయే వాడుంటే మాకేంటి అన్నట్టు మోసగాళ్లు రెచ్చిపోతున్నారు.

సోఫాసెట్‌ కొనడానికి చాటింగ్‌ చేసి రూ. 1.45 లక్షలు కొట్టేశాడు

 రాజమహేంద్రవరం సిటీ, జూలై 3 : మోసాలు కొత్త పుంతలు తొక్కుతు న్నాయి. ఏ వైపు ఎలా మోసపోతామో తెలియడం లేదు.. మోసపోయే వాడుంటే మాకేంటి అన్నట్టు మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటువంటిదే ఒక సంఘటన ఆదివారం రాజమ హేం ద్రవరంలో జరిగింది. రాజమహేంద్రవరం సాయిదుర్గా నగర్‌కు చెందిన కె.నగేష్‌ తన సోఫాసెట్‌ను అమ్మడానికి ఓఎల్‌ఎక్స్‌ యాప్‌లో రూ. 22 వేలకు పోస్టింగ్‌ పెట్టాడు. ఒక అపరిచత వ్యక్తి తాను కొంటానని చాటింగ్‌ చేశాడు.నగదు మీ అకౌంట్‌కు పంపిస్తాను క్యూఆర్‌ కోడ్‌ మీకు పెట్టాను దానిని స్కాన్‌ చేయాలని ఆ అపరిచిత వ్యక్తి చెప్పడంతో నమ్మేసిన నగేష్‌ వెంటనే ఆలోచించకుండా స్కాన్‌ చేసేశాడు. వెంటనే అవతలి వ్యక్తి రూ. 20 వేలు లాగేశాడు. అయితే పొరపాటున జరిగింది.. మళ్లీ స్కాన్‌ చేయమని చెబితే నమ్మిన నగేష్‌ మళ్లీ స్కాన్‌ చేశాడు.ఈ సారి పెద్దమొత్తంలో            నగదును అపరిచిత వ్యక్తి లాగేశాడు. ఇలా రూ.1.45 లక్షలు అపహరించాడు. దీంతో బాధితుడు ఆదివారం ప్రకాష్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2022-07-04T06:31:41+05:30 IST