Suicide: ఆన్‌లైన్‌ రమ్మీకి మరొకరి బలి

ABN , First Publish Date - 2022-08-04T13:38:13+05:30 IST

ఆన్‌లైన్‌ రమ్మీ(Online Rummy)కి మరో యువకుడు బలయ్యాడు. నామక్కల్‌ జిల్లా రాశిపురం సమీపం ఆర్‌. పట్టణానికి చెందిన విశ్వనాథన్‌ ఆర్టీసీలో

Suicide: ఆన్‌లైన్‌ రమ్మీకి మరొకరి బలి

పెరంబూర్‌(చెన్నై), ఆగస్టు 3: ఆన్‌లైన్‌ రమ్మీ(Online Rummy)కి మరో యువకుడు బలయ్యాడు. నామక్కల్‌ జిల్లా రాశిపురం సమీపం ఆర్‌. పట్టణానికి చెందిన విశ్వనాథన్‌ ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమారులుండగా, పెద్ద కుమారుడు సురేష్‌ (26) డిగ్రీ పూర్తిచేసాడు. ఇంట్లో ఉంటున్న సురేష్‌ ఆన్‌లైన్‌ రమ్మీకి బానిసై, స్నేహితులు, బంధువులు, పైనాన్స్‌ సంస్థలు దగ్గర రూ.5 లక్షలకు పైగా అప్పు చేసి రమ్మీ ఆడి డబ్బు పోగొట్టుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించలేక, ఫైనాన్స్‌(Finance) సంస్థల ఒత్తిడి తట్టుకోలేక బుధవారం సురేష్‌ ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య(Suicide)కు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, సూసైడ్‌ నోట్‌ స్వాధీనం చేసుకొని విచారణ జరిపారు.

Updated Date - 2022-08-04T13:38:13+05:30 IST