సైబర్‌ సంరక్షణపై ఆన్‌లైన్‌ క్విజ్‌

ABN , First Publish Date - 2020-10-23T10:02:58+05:30 IST

సైబర్‌ సంరక్షణపై వారంలో రెండుసార్లు ఆన్‌లైన్‌ క్విజ్‌ నిర్వహిస్తున్నామని సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ - డాక్‌) ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్‌నెస్‌ (ఐఎ్‌సఈఏ) అసోసియేట్‌ డైరెక్టర్‌

సైబర్‌ సంరక్షణపై ఆన్‌లైన్‌ క్విజ్‌

కొత్తపేట, అక్టోబర్‌ 22 (ఆంధ్రజ్యోతి): సైబర్‌ సంరక్షణపై వారంలో రెండుసార్లు ఆన్‌లైన్‌ క్విజ్‌ నిర్వహిస్తున్నామని సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ - డాక్‌) ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్‌నెస్‌ (ఐఎ్‌సఈఏ) అసోసియేట్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ఏఎస్‌ మూర్తి తెలిపారు. సైబర్‌ నేరాలపై ప్రజల్లో మెరుగైన అవగాహన కల్పించడానికి నేషనల్‌ సైబర్‌ సెక్యూరిటీ అవేర్‌నెస్‌(ఎన్‌సీఎ్‌సఏఎం)లో భాగంగా ఆన్‌లైన్‌లో పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఐఎ్‌సఈఏ నిపుణులు రూపొందించిన క్విజ్‌లో దేశ, విదేశీ విద్యార్థులు, ఇతరులు పాల్గొంటున్నారని, వారి అభ్యర్థన మేరకు వారంలో రెండుసార్లు క్విజ్‌ నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. నెటిజన్లు, స్మార్ట్‌ ఫోన్లు వాడే ప్రతి ఒక్కరూ క్విజ్‌లో పాల్గొనవచ్చు. పాల్గొన్న వారికి ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కూడా అందజేస్తారు. జ్ట్టిఞట://జీుఽజౌట్ఛఛ్చిఠ్చీట్ఛుఽ్ఛటట.జీుఽ/్ఞఠజ్డీ వెబ్‌సైట్‌లో వివరాలు పొందవచ్చు. 

Updated Date - 2020-10-23T10:02:58+05:30 IST