Online Loan App వేధింపులకు మరో యువతి బలి
ABN , First Publish Date - 2022-07-12T19:44:46+05:30 IST
గుంటూరు (Guntur) జిల్లా: మంగళగిరి మండలం, చినకాకానిలో దారుణం చోటు చేసుకుంది.
గుంటూరు (Guntur) జిల్లా: మంగళగిరి మండలం, చినకాకానిలో దారుణం చోటు చేసుకుంది. లోన్ యాప్ (Loan App) నిర్వాహకుల వేధింపులు భరించలేక ప్రత్యూష (Prathyusha) అనే వివాహిత ఆత్మహత్య (Suicide) చేసుకుంది. అయితే ఆత్మహత్యకు ముందు భర్తకు సెల్పీ వీడియో (Selfie video) పంపించింది. ఆన్లైన్ (Online) లోన్ యాప్ ద్వారా రూ. 20 వేలు తీసుకున్నానని, ఆ డబ్బులు తిరిగి కట్టినప్పటికీ లోన్ యాప్ సిబ్బంది పదే పదే ఫోన్ చేసి మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని, ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని, తనలా ఎవరూ ఆన్లైన్ లోన్ యాప్ ద్వారా రుణం తీసుకోవద్దని సెల్ఫీ వీడియో ద్వారా తెలిపింది. తన కుటుంబం.. తల్లీ, తండ్రీ, భర్త తనను క్షమించాలని కోరింది. కుటుంబం పరువు పోతుందని తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ప్రత్యూష పేర్కొంది.
తాను తీసుకున్న రూ. 20వేలు తిరిగి చెల్లించినా.. ఇంకా డబ్బులు కట్టాలంటూ తన కుటుంబసభ్యులు, బంధువులకు లోన్ యాప్ నిర్వాహకులు మెసేజ్లు పెట్టారని ప్రత్యేష పేర్కొంది. ఈ విషయమై కొంతమంది బంధువులు కూడా తనను అడిగారని తెలిపింది. సోమవారం ఉదయం 7 గంటలలోపు డబ్బులు కట్టకపోతే న్యూడ్ ఫోటోలు కుటుంబసభ్యులు, బంధువులకు పంపుతామని బ్లాక్ మెయిల్ చేశారని, ఈ అవమానం ఇక తాను భరించలేనని సెల్ఫీ వీడియో ద్వారా తన బాధ నంత చెబుతూ.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రత్యూష ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.