కొంపముంచిన ఆన్‌లైన్ గేమ్.. 15 లక్షలు చెల్లించలేక..

ABN , First Publish Date - 2022-05-07T17:49:45+05:30 IST

రాజస్థాన్‌లోని భీల్వాడా జిల్లాలోని

కొంపముంచిన ఆన్‌లైన్ గేమ్.. 15 లక్షలు చెల్లించలేక..

రాజస్థాన్‌లోని భీల్వాడా జిల్లాలోని పరోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీపుర గ్రామంలో 25 ఏళ్ల యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ యువకుడి ఆత్మహత్యకు అప్పుల బాధే కారణమని తెలుస్తోంది. ఈ యువకుడు రూ. 15 లక్షల వరకు అప్పు చేశాడు. అతను వాటిని తిరిగి చెల్లించలేకపోయాడు. యువకుడి ఆత్మహత్యకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. 


పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ ఉదంతం గురించి పరోలి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి రాంస్వరూప్ లాంబా మాట్లాడుతూ శుక్రవారం మధ్యాహ్నం లక్ష్మీపుర నివాసి కమలేష్ కుమారుడు రామ్‌ధన్ ధాకడ్ తన ఇంటి నుంచి పొలానికి వెళ్లాడని తెలిపారు. పొలం నుంచి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అక్కడకు వెళ్లి చూసే సరికి పొలంలో చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అప్పుల బాధే ఈ ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. మృతుడు కమలేష్‌ నిరుద్యోగి. అతను ఆన్‌లైన్ గేమ్‌లు, బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. ఈ నేపధ్యంలో రూ. 15 లక్షల వరకూ అప్పులు చేశాడు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. కమలేష్ ఆత్మహత్యకు ఇదే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. కమలేష్‌కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Read more