ఆన్‌లైన్‌లో వల వేశాడు..రూ.31 వేలు దోచేశాడు..!

ABN , First Publish Date - 2020-08-10T10:57:36+05:30 IST

ఆన్‌లైన్‌ మోసంతో మండలంలోని ముష్ట్లగంగవరం గ్రామానికి చెం దిన ముగ్గురు యువకుల నుంచి రూ.31 వేలు దోచేశాడు ..

ఆన్‌లైన్‌లో వల వేశాడు..రూ.31 వేలు దోచేశాడు..!

కురిచేడు, ఆగస్టు 9: ఆన్‌లైన్‌ మోసంతో మండలంలోని ముష్ట్లగంగవరం గ్రామానికి చెం దిన ముగ్గురు యువకుల నుంచి రూ.31 వేలు దోచేశాడు ఓ హాకర్‌. మోసపోయినట్లు గ్రహిం చిన వారు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. మొదటగా ఓ యువకునికి మీ స్నేహితుని అన్నను అంటూ ఫోన్‌ చేసి డబ్బు లు కావాలని అడుగగా లేవని చెప్పాడు. నేనొక లింక్‌ పంపుతాను, ఆ లింక్‌ ఓపెన్‌ చేసి ఓటీపీ చెప్పమన్నాడు. లింక్‌ పంపగానే ఓపెన్‌ చేసి సదరు వ్యక్తికి ముష్ట్లగంగవరం యువకుడు ఓటీపీ చెప్పాడు. ఇది చెప్పిన కొద్దిసేపటికి యువకుని సెల్‌ పనిచేయలేదు.


ఫేస్‌బుక్‌, జీ మెయిల్‌ ఓపెన్‌ కాలేదు. పాస్‌వర్డ్‌ మారినట్లు చూపింది. వెంటనే అతని ఆంధ్రాబ్యాంక్‌ ఖాతా నుంచి రు.7,800 ఖాళీ అయ్యాయి. అదే గ్రామానికి చెందిన మరో యువకుని వద్ద నుంచి రు.18,000, మూడో యువకుని వద్ద నుంచి  కూడా రు.5,500 లాగేశాడు. మోసం చేసిన వ్యక్తికి ఫోన్‌ చేస్తే ట్రూ కాలర్‌లో ఎఫ్‌బీ హాకర్‌ అని వస్తున్నట్లు యువకులు  చెప్తున్నారు. అత డితో యువకులు చాటింగ్‌ చేశారు. డబ్బులు ఇవ్వమంటే ఇస్తాను అని చెపుతున్నాడని వారు తెలిపారు. ఇది వ్యవహారం రెండు రోజులుగా జరిగిన ట్లు చెప్పారు. కురిచేడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యా దు చేయనున్నట్లు యవకులు తెలిపారు. 

Updated Date - 2020-08-10T10:57:36+05:30 IST