ఆన్‌లైన్‌ బోధన అదిరేలా...

ABN , First Publish Date - 2020-08-22T19:25:43+05:30 IST

ఇన్ఫోగ్రాఫిక్స్‌, ప్రెజెంటేషన్లు, పోస్టర్లు, విజువల్‌ మెటీరియల్స్‌ను తయారు చేసుకోవడానికి ‘పిక్టోచార్ట్‌’ టూల్‌ ఉపయోగపడుతుంది. హోమ్‌ యాక్టివిటీకి ఇది బాగా ఉపకరిస్తుంది.

ఆన్‌లైన్‌ బోధన అదిరేలా...

ఇన్ఫోగ్రాఫిక్స్‌, ప్రెజెంటేషన్లు, పోస్టర్లు, విజువల్‌ మెటీరియల్స్‌ను తయారు చేసుకోవడానికి ‘పిక్టోచార్ట్‌’ టూల్‌ ఉపయోగపడుతుంది. హోమ్‌ యాక్టివిటీకి ఇది బాగా ఉపకరిస్తుంది. కరోనా మూలంగా పిల్లల చదువు ఆన్‌లైన్‌లోకి మారిపోయింది. టీచర్లు జూమ్‌, స్కైప్‌ వంటి యాప్స్‌లో పాఠాలు చెబుతున్నారు. మరి ఆన్‌లైన్‌లో పాఠాలు ఎఫెక్టివ్‌గా చెప్పాలంటే కొన్ని డిజిటల్‌ టూల్స్‌ను ఎంచుకోవాల్సిందే. పిల్లలకు ఆన్‌లైన్‌ పాఠాల పట్ల ఆసక్తి పెరగడానికి ఈ టూల్స్‌ ఉపకరిస్తాయి. అలాంటి టూల్స్‌ కొన్ని ఇవి..



కొన్నిపాఠాలు యానిమేటెడ్‌ వీడియోలతో చెబితే పిల్లలకు సులభంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఆన్‌లైన్‌ పాఠాలు బోధించే సమయంలో ఇలాంటి వీడియోల అవసరం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వీడియోలు రూపొందించడానికి ‘యానిమోటో’ డిజిటల్‌ టూల్‌ ఉపయోగపడుతుంది. దీంతో ఒకటి కన్నా ఎక్కువ వీడియోలను కలిపి చూపించొచ్చు. ఫొటో స్లైడ్‌ షోలు రూపొందించవచ్చు.


గూగుల్‌ డాక్స్‌

జూమ్‌, స్కైప్‌ వంటి యాప్స్‌లో ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్తారు. పిల్లలకు వర్క్‌షీట్‌ ఇవ్వాలంటే ఇమేజ్‌ చూపించి లేక బోర్డు చూపిస్తూ నోట్‌ చేసుకొమ్మని చెప్పాల్సి ఉంటుంది. అలాకాకుండా గూగుల్‌ డాక్స్‌ను ఉపయోగించినట్లయితే పిల్లలకు ఒక లింక్‌ను పంపడం ద్వారా వర్క్‌షీట్‌ పూర్తి చేయమని కోరవచ్చు. ఆ వర్క్‌షీట్‌ కావాలంటే ఎడిట్‌ చేసుకోవచ్చు. తప్పులు ఉంటే సరిచేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ క్లాసుల పట్ల పిల్లలకు ఆసక్తి పెరిగేలా చేయడానికి ఈ టూల్‌ బాగా పని కొస్తుంది. 


ఆన్‌లైన్‌ పాఠాలు ఇలా భద్రం!

స్కైప్‌ వంటి వాటిలో చెప్పిన పాఠాల వీడియోలను నేరుగా స్టోర్‌ చేసుకోవడానికి లేదు. అలాంటప్పుడు వీడియోలను యూట్యూబ్‌లో లేదా విమియోలో భద్రపరచుకోవచ్చు. వాటికి పాస్‌వర్డ్‌ పెట్టుకోవచ్చు. విద్యార్థులకు వాటిని ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవచ్చు. 


స్రీన్‌ రికార్డింగ్‌

కంప్యూటర్‌ స్ర్కీన్‌పై మీరు చేసే ప్రతి క్లిక్‌ను రికార్డు చేసుకోవచ్చు. ఇందుకోసం ‘క్విక్‌టైమ్‌ప్లేయర్‌’ అనే టూల్‌ ఉపయోగపడుతుంది. ఇది మీ కంప్యూటర్‌ స్ర్కీన్‌ను రికార్డు చేస్తుంది. అంటే మీరు చెప్పిన క్లాసును రికార్డు చేసి డెస్క్‌టా్‌పపై సేవ్‌ చేస్తుంది. ఆ ఫైల్‌ను గూగుల్‌ డ్రైవ్‌లో అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రీవియస్‌ క్లాసులు వినాలనుకుంటున్న విద్యార్థులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. టీచర్లు కూడా తమ క్లాసులను రివ్యూ చేసుకోవడానికి ఉపకరిస్తుంది. ‘షోమోర్‌’ టూల్‌ కూడా స్ర్కీన్‌ రికార్డింగ్‌కు ఉపయోగపడుతుంది. 


ఫన్‌ను జోడిస్తూ...

కొద్దిగా ఫన్‌ను జోడిస్తే పిల్లలు ఏ విషయాన్నైనా త్వరగా నేర్చుకుంటారు. పాఠాన్ని ఒక గేమ్‌లా బోధిస్తే పిల్లలు మరింత ఆసక్తిగా వింటారు. మ్యాథ్స్‌, సైన్స్‌, ఇంగ్లీష్‌... సబ్జెక్ట్‌ ఏదైనా ఈ టూల్‌ సహాయంతో టీచర్లు విద్యార్థులతో ఇంటరాక్ట్‌ కావచ్చు. పిల్లల్లో సబ్జెక్ట్‌కు సంబంధించిన అంశాలు ఎక్కువ సమయం పునఃశ్చరణ చేసుకునేందుకు ఈ తరహా బోధన తోడ్పడుతుంది. 


ప్రణాళిక అవసరం

పాఠం చెప్పాలంటే ముందు ప్రణాళిక ఉండాలి. ఏం చెప్పాలి? ఎలాంటి టీచింగ్‌ ఎయిడ్స్‌  ఉపయోగించాలి? చివరకు ఎలాంటి ప్రశ్నలు ఇవ్వాలి? ఈ అంశాలన్నీ ముందుగానే ప్రిపేర్‌ చేసుకోవాలి. అలాంటి టీచింగ్‌ ప్లాన్స్‌ తయారుచేసుకోవడానికి ఈ ‘స్ర్కాచ్‌’ టూల్‌ ఉపయోగపడుతుంది. విజువల్‌ యానిమేషన్స్‌  రూపొందించడానికి, ఇతర యూజర్లతో ఇంటరాక్ట్‌ కావడానికి విద్యార్థులకు పనికొస్తుంది.


హైకు డెక్‌

స్మార్ట్‌ఫోన్‌లో, వెబ్‌లో ప్రెజెంటేషన్లు సులభంగా తయారుచేయడానికి ఈ డిజిటల్‌ టూల్‌ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది రకరకాల ఫొటోల డేటాబే్‌సను కలిగి ఉంది. అందులో మీకు నచ్చిన ఫొటోలు ఎంచుకోవచ్చు. వాటితో ఇమేజ్‌ బేస్డ్‌ స్లైడ్స్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చు. 


వర్చ్యువల్‌ ఎన్విరాన్‌మెంట్‌ కావాలంటే...

ఆన్‌లైన్‌ పాఠాలు బోధించే సమయంలో వర్చ్చువల్‌ ఎన్విరాన్‌మెంట్‌ను క్రియేట్‌ చేయడానికి ‘ఎక్స్‌ప్లేన్‌ ఎవ్రీథింగ్‌’ టూల్‌ ఉపయోగపడుతుంది. విద్యార్థులు గ్రూప్‌ యాక్టివిటీ్‌సలో పాల్గొనేలా చేసేందుకు పనికొస్తుంది. అంతేకాకుండా ఇది డ్రాప్‌బాక్స్‌, ఎవర్‌నోట్‌, జిడ్రైవ్‌, వన్‌డ్రైవ్‌ వంటి ఇతర యాప్స్‌తో అనుసంధానం అవుతుంది.


ట్రాక్‌ చేయండిలా...!

మెటీరియల్‌ను తయారుచేయడం, డిస్ట్రిబ్యూట్‌ చేయడం, అసె్‌సమెంట్స్‌ ఇవ్వడం, ప్రోగ్రె్‌సను ట్రాక్‌ చేయడం... ఈ పనులన్నీ చేయడానికి ‘స్కూలాజీ’ ఉపయోగపడుతుంది. ఈ లెర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఆడియో, వీడియో రికార్డు చేసే సౌలభ్యం ఉంది. కంటెంట్‌ను సులభంగా ఆర్గనైజ్‌ చేసుకోవడానికి ఉపకరిస్తుంది.




ఎఫెక్టివ్‌గా చెప్పాలంటే...

ఆన్‌లైన్‌ పాఠం ఎఫెక్టివ్‌గా ఉండాలంటే ‘గ్లాగ్‌స్టర్‌’ టూల్‌ను ఉపయోగించాల్సిందే. పిల్లలు విజువల్‌ కంటెంట్‌ సహాయంతో నేర్చుకోవడానికి ఈ డిజిటల్‌ టూల్‌ ఉపకరిస్తుంది. ఈ యాప్‌ సహాయంతో మల్టీమీడియా పోస్టర్లు తయారుచేసుకోవచ్చు. వీటిని గ్లాగ్స్‌ అని పిలుస్తారు. అలాగే గ్లాగ్‌పీడియా అనే ప్రత్యేకమైన లైబ్రరీలో వాటిని స్టోర్‌ చేసుకోవచ్చు. రకరకాల పాఠ్యాంశాలకు సంబంధించిన 40 వేల రకాల గ్లాగ్స్‌ ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి.


మంచి ప్రెజెంటేషన్‌ కోసం...


వీడియో కాన్ఫరెన్సింగ్‌ యాప్‌లో పాఠాలు చెప్పుకుంటూ పోతే సరిపోదు.  విజువల్‌ ప్రెజెంటేషన్‌ ఉన్నప్పుడే పిల్లలకు బాగా అర్థమవుతుంది. సులభంగా నేర్చుకోగలుగుతారు. మంచి ప్రెజెంటేషన్‌ విద్యార్థికి పాఠంపై ఆసక్తి పెంచేలా చేస్తుంది. ముఖ్యంగా స్లైడ్‌లు ఉపయోస్తూ  చెబితే పిల్లలు చూపు తిప్పుకోకుండా వింటారు. టీచింగ్‌లో ఇది చాలా అవసరం. అలాంటి స్లైడ్‌లు క్రియేట్‌ చేసుకోవడానికి ‘ప్రెజి’ టూల్‌ ఉపయోగపడుతుంది. ఒకరకంగా చెప్పాలంటే పవర్‌పాయింట్‌కు మంచి ప్రత్యామ్నాయం. స్లైడ్‌ షోలో జూమ్‌ఇన్‌, జూమ్‌అవుట్‌ ఎఫెక్ట్‌తో మంచి లుక్‌ను తీసుకురావచ్చు. ప్రెజెంటేషన్‌ మరింత బాగుండాలంటే స్లైడ్స్‌కు ఫొటోలు, వీడియోలు, లోగోలు కూడా జతచేసుకోవచ్చు.

Updated Date - 2020-08-22T19:25:43+05:30 IST