నేటి నుంచి వ్యాపార మెళకువలపై ఆన్‌లైన్‌ శిక్షణ

ABN , First Publish Date - 2021-05-06T13:38:51+05:30 IST

వ్యాపార రంగంలో రాణించాలనుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు..

నేటి నుంచి వ్యాపార మెళకువలపై ఆన్‌లైన్‌ శిక్షణ

హైదరాబాద్/ప్రగతినగర్‌ : వ్యాపార రంగంలో రాణించాలనుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు (స్త్రీలు, పురుషులు), సీఈడీ (సెంటర్‌ ఫర్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ డెవలప్‌మెంట్‌ ఆన్‌ అండర్‌ టేకింగ్‌ ఆఫ్‌ అలిప్‌ ఇండియా) ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఔత్సాహికులకు ఉత్పత్తులపై అవగాహన, నిర్వహణ అంశాలపై ఈ నెల 6 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఈడీపీ ఆన్‌లైన్‌ తరగతుల్లో వివిధ పారిశ్రామిక అవకాశాలు, ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీలు, పరిశ్రమలు ఎలా నెలకొల్పాలి అనే అంశాలు, ఎంఎస్‌ఎంఈ, ఎన్‌ఎస్‌ఐసీ రిజిస్ట్రేషన్‌, డిటైల్‌ ప్రాజెక్ట్‌ రిపోర్టుపై శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు అలిప్‌ సీఈడీ సెక్రటరీ త్రిపురాంబ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 7036666423, 8919186385 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.

Updated Date - 2021-05-06T13:38:51+05:30 IST