ఆన్‌లైన్‌ తరగతులతో మేలు

ABN , First Publish Date - 2022-01-21T18:27:49+05:30 IST

కరోనా కారణంగా రెండేళ్లుగా విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులకు అలవాటుపడ్డారు. అయితే, పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చినా.. ఆన్‌లైన్‌ విధానం కొనసాగించాలని పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. తరగతి గది పాఠాలకు

ఆన్‌లైన్‌ తరగతులతో మేలు

ఈ విధానాన్ని కొనసాగించాలి  

ఫ్యూచర్‌ ఆఫ్‌ లెర్నింగ్‌ స్టడీ సర్వేలో వెల్లడి


హైదరాబాద్‌ సిటీ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): కరోనా కారణంగా రెండేళ్లుగా విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులకు అలవాటుపడ్డారు. అయితే, పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చినా.. ఆన్‌లైన్‌ విధానం కొనసాగించాలని పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. తరగతి గది పాఠాలకు అనుబంధంగా ఇవి జరిగితే బాగుంటుందని చెప్పారు. అయితే, తమకు ఆన్‌లైన్‌ విధానం వద్దని మెజార్టీ సంఖ్యలో విద్యార్థులు వెల్లడించారు. ఆన్‌లైన్‌ విద్యా విధానం, భవిష్యత్తులో నేర్చుకునే పద్ధతులపై ‘ఫ్యూచర్‌ ఆఫ్‌ లెర్నింగ్‌ స్టడీ 2022’ పేరుతో హెచ్‌పీ ఇండియా నిర్వహించిన ఓ సర్వేలో ఈ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా 13 నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం 1597 మంది పాల్గొన్నారు. ఇందులో విద్యార్థులు(14-22 ఏళ్ల వయస్సు), వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ సర్వేకు సంబంధించిన వివరాలను హెచ్‌పీ ఇండియా ఎండీ కేతన్‌ పటేల్‌ వెబినార్‌ ద్వారా వివరించారు. కరోనా సంక్షోభ సమయంలో విద్యకు అంతరాయం కలగకుండా ఆన్‌లైన్‌ తరగతులు ఉపకరించాయని 89ు మంది విద్యార్థులు, 98ు తల్లిదండ్రులు చెప్పారు. సెషన్‌ను రికార్డు చేసుకునే అవకాశం ఉండటంవల్ల నచ్చిన సమయం లో మళ్లీ క్లాస్‌ వినేందుకు ఆన్‌లైన్‌ విధానం బాగుంద ని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. అదనపు తరగతుల నిర్వహణకు, విద్యార్థుల అనుమానాల నివృత్తికి ఆన్‌లైన్‌ విధానం అనుకూలంగా ఉందని 92ు మంది ఉపాధ్యాయులు చెప్పారు.  క్లాస్‌ రూమ్‌ విధానానికి అనుబంధంగా భవిష్యత్తులో కూడా ఆన్‌లైన్‌ విధానం కొనసాగాలని 85ు మంది టీచర్లు, 94ు మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. అయితే, 76ు మంది విద్యార్థులు తరగతి గది చదువుకే ఓటేశారు. 

Updated Date - 2022-01-21T18:27:49+05:30 IST