భారంగా.. ఆన్‌లైన్‌ చదువులు

ABN , First Publish Date - 2021-06-20T05:19:14+05:30 IST

కరోనా కష్టాలు తెచ్చిపెట్టింది. ఉపాధి కోల్పోయి కొందరు.. జీతాలు తగ్గి మరికొందరు జీవనం కష్టంగా మారిపోయింది.

భారంగా.. ఆన్‌లైన్‌ చదువులు

30శాతం పెరిగిన స్మార్ట్‌ఫోన్లు ధరలు

కంప్యూటర్లు, విడిభాగాల ధరలూ పైపైకే

ఫీజులు.. గాడ్జెట్ల భారంతో లబోదిబో మంటున్న తల్లిదండ్రులు

ఎమ్మార్పీ మించి అమ్మితే ఫిర్యాదు చేయాలంటున్న అధికారులు


గుంటూరు(తూర్పు), జూన్‌ 19: కరోనా   కష్టాలు తెచ్చిపెట్టింది. ఉపాధి కోల్పోయి కొందరు.. జీతాలు తగ్గి మరికొందరు జీవనం కష్టంగా మారిపోయింది. ఈ పరి స్థితుల్లో పిల్లల చదువులు మరింత భారంగా మారాయి. ఒకప్పుడు విద్యాసంస్థలకు ఫీజు ఒక్కటి కడితే  చదువు సాగేది. కానీ ప్రస్తుత కరోనా కాలంలో ఫీజుతో పాటు ఆన్‌లైన్‌ తరగతులకు సంబంధించి స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌ లు, కంప్యూటర్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో డిమాండ్‌ పెరగడంతో  వాటి ధరలు ఆకాశాన్ని అంటు తున్నాయి.   మరమ్మతులకు అదనంగా వ్యయం భరిం చాల్సి వస్తోంది. ఏప్రిల్‌ వరకు సాఽధారణంగా ఉన్న కం ప్యూటర్‌ వాటి విడిభాగాల ధరలు లాక్‌డౌన్‌ మొదలైన నాటి నుంచి ఒక్కసారిగా 30 శాతం పైగా పెరిగాయి. రూ.20 వేలు ధర ఉండే సాఽధారణ కంప్యూటర్‌ రూ30  వేలకు చేరింది. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు సంగతి ప్రత్యే కంగా చెప్పనక్కర్లేదు. కంప్యూటర్‌ విడిభాగాలైన ప్రాసె సర్‌, హార్డ్‌డిస్క్‌ల ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి. గతంలో మంచి కంపెనీకు సంబంధించి హార్డ్‌డిస్క్‌ రూ.1000 నుంచి 2 వేల వరకు ఉంటే ప్రస్తుతం దాని ధర 3 వేల 500 వరకు చేరుకుంది. వీటితో పాటు వెబ్‌క్యామ్‌, కీ ప్యాడ్‌, మదర్‌బోర్డుల ధరలు కూడా అమాంతం పెరిగాయి.


రూ.25 వేలకు చేరిన గ్రాఫిక్‌ కార్డు..

సాధారణంగా రూ.3 వేలు ఉండే గ్రాఫిక్‌ కార్డుల ధరలు ఒక్కసారిగా నాణ్యతను బట్టి రూ.25 నుంచి 45 వేలకు చేరుకున్నాయి.   ఆన్‌లైన్‌ తరగతుల సమయంలో ప్రాక్టికల్స్‌ వంటి వాటికి వీటిని ఉపయోగిస్తుంటారు. 


హార్డ్‌వేర్‌ నిపుణుల కొరత

వర్క్‌ఫ్రమ్‌ హోం, ఆన్‌లైన్‌ తరగతులతో కంప్యూటర్‌, ట్యాబ్‌ల వినియోగం పెరిగింది. ఈ కారణంగా ఇవి ఎక్కువగా మరమ్మతులకు గురవుతున్నాయి. అయితే ఆ స్థాయిలో జిల్లాలో హార్డ్‌వేర్‌ నిపుణులు అందు బాటులో లేరు. దీంతో పాడైపోయిన పీసీలు బాగు చేయాలంటే వారం నుంచి పది రోజుల వరకు పడుతుంది. ఈ పది రోజులు విధులకు లేదా తరగతులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. 


కొనుగోలు సమయంలోనే జాగ్రత్త ..

కంప్యూటర్‌, వాటి విడిభాగాలు కొనేసమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణు లు చెబుతున్నారు. సాధారణంగా కం ప్యూటర్‌ విడిభాగాలు ఎక్కువగా ఎమ్మార్పీ దాని కంటే తక్కువకే అమ్ము తుంటారు. ఎందుకంటే తయారీదారులు ఎక్కువ ధర ముద్రించి, అసలు ధరల లిస్ట్‌లను దుకాణదారులకు అందిస్తుంటారు. దుకాణదారుడు ఎమ్మార్పీ కాకుండా లిస్ట్‌లో ఉన్న ధరకే వీటిని విక్రయిస్తుంటాడు. ఇటు వంటి వాటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తున్నప్పుడు ఎమ్మార్పీతోపాటు త యారీ తేది, బ్యాచ్‌, టోల్‌ఫ్రీ నెంబరు, వస్తువు వాడకా నికి చివరితేది, తయారీదారుడి వివరాలు, ఫిర్యాదుకు మొయిల్‌ ఐడీ వంటివి తప్పనిసరిగా చూడాలి.


ఫిర్యాదు చేయండి

ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నప్పుడు లేదా వస్తువుపై వివ రాలను సరిగా ముద్రించనపుడు  లీగల్‌ మెట్రాలజీ వారికి, నాసిరకం వస్తువుల ను విక్రయిస్తే వినియోగదారుల ఫోరానికి ఫిర్యాదు చేయాలి. వస్తువు కొనుగోలు సమయంలో రశీదు తీసు కోవాలి. ఫిర్యాదు పారదర్శకంగా ఉంటే వారం రోజుల్లోనే తయా రీదారుడి నుంచి నష్టపరిహారం పొందవచ్చు. జిల్లాలో ఎవరైనా ఇటువంటి మోసాలకు గురైతే 98495-00354 అనే నెంబరుకు నేరుగాకాని, వాట్సాప్‌ ద్వారా  ఫిర్యాదు చేయవచ్చు.  

 

Updated Date - 2021-06-20T05:19:14+05:30 IST