బయోమె..ట్రిక్‌.. అవినీతికి చెక్‌

ABN , First Publish Date - 2021-06-14T05:11:22+05:30 IST

బయోమె..ట్రిక్‌.. అవినీతికి చెక్‌

బయోమె..ట్రిక్‌.. అవినీతికి చెక్‌

రవాణా ఆన్‌లైన్‌ ఆధారిత సేవల్లో తప్పనిసరి

బయోమెట్రిక్‌ డివైజ్‌ ఉండి తీరాల్సిందే..

అలా అయితేనే ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌

ఇలా రిజిస్ట్రేషన్‌ కాని వారికి యాక్సెస్‌ నిల్‌

విజయవాడ, ఆంధ్రజ్యోతి : రవాణా శాఖలో ఆన్‌లైన్‌ సేవలను వినియోగించే వారి బయోమెట్రిక్‌ డివైజ్‌ల విషయంలో అధికారులు ఆంక్షలు విధించారు. ఏది పడితే ఆ డివైజ్‌ను ఉపయోగించటం కాకుండా ‘సెక్యూజెన్‌’ అనే బయోమెట్రిక్‌ డివైజ్‌నే ఉపయోగించాలని నిర్దేశించారు. ఈ డివైజ్‌ను ఉపయోగించుకుని మాత్రమే రవాణా శాఖ ద్వారా సేవలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. అంతకంటే ముందు సెక్యూజెన్‌ డివైజ్‌ను రవాణా శాఖలో రిజిస్ర్టేషన్‌ చేసుకోవాల్సి ఉంటుందని, ఈ రిజిస్ర్టేషన్‌ ప్రక్రియను కూడా ఆన్‌లైన్‌లోనే ఎవరికి వారు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

అవినీతికి ఆస్కారం లేకుండా..

ఇప్పటికే దాదాపు 90 శాతం సేవలను రవాణా శాఖ ఆన్‌లైన్‌ చేసింది. మొబైల్‌, ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌ ఉన్నవారు ఎవరైనా సరే రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లకుండా సేవలు పొందవచ్చు. ఈ సేవల్లో వెహికల్‌ ట్రాన్స్‌ఫర్‌, రిజిస్ర్టేషన్‌ ఆధార్‌ సీడింగ్‌, రిజిస్ర్టేషన్‌ రెన్యువల్‌, డూప్లికేట్‌ ఆర్‌సీ తదితరాలను పొందటానికి  వాహనదారులు బయోమెట్రిక్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు ఏదైనా డివైజ్‌ను కొనాలి. గతంలో రవాణా శాఖ సెక్యూజెన్‌ అనే డివైజ్‌ను బయోమెట్రిక్‌ సేవలకు సూచించింది. అయినా ఎవరికి వారు సెక్యూజెన్‌ లేదా ఇతర డివైజ్‌లను కొనుగోలు చేసి రవాణా సేవలను పొందుతున్నారు. వాహనదారులైతే వ్యక్తిగతంగానూ, సీఎస్‌సీ కేంద్రాల వారు, మీ సేవా కేంద్రాల నిర్వాహకులు బయోమెట్రిక్‌ డివైజ్‌లను వినియోగిస్తూ సేవలు అందిస్తున్నారు. బయోమెట్రిక్‌ అనేది వ్యక్తి గుర్తింపును తెలిపే అతి ముఖ్యమైనది కావటంతో నిబంధనలు ఉల్లంఘించే అవకాశాలు లేకపోలేదు. సైబర్‌ నేరాలకు కూడా ఆస్కారం ఉంటుంది. బయోమెట్రిక్‌ను ఆధారం చే సుకుని అడ్డదారిలో సేవలను అందించే పరిస్థితి కూడా ఉంటోంది. ఇలా బయోమెట్రిక్‌ డివైజ్‌లను వినియోగించే వారిపై దృష్టి పెట్టేందుకు రవాణా శాఖ బయోమెట్రిక్‌ డివైజ్‌ రిజిస్ర్టేషన్‌ను తప్పనిసరి చేసింది.

ఆన్‌లైన్‌ లో బయోమెట్రిక్‌ ఆప్షన్‌ కట్‌

బయోమెట్రిక్‌ డివైజ్‌లను తమ దగ్గర రిజిస్ర్టేషన్‌ చేసుకోని వారు రవాణా వెబ్‌సైట్‌ ద్వారా సేవ లు పొందే అవకాశాన్ని కత్తిరించారు. బయోమెట్రిక్‌ ఆప్షన్‌లోకి వెళ్లాలంటే తప్పనిసరిగా ఆ డివైజ్‌కు సంబంధించి రిజిస్ర్టేషన్‌ అయి ఉండాలి. రిజిస్ర్టేషన్‌ కాకపోతే మాత్రం యాక్సెస్‌ రాదు. బయోమెట్రిక్‌ ఆప్షన్‌లోకి వెళ్లినవారు చాలామందికి ఈ సమాధానమే వస్తోంది. 

ఇలా రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలి

రవాణా శాఖ వెబ్‌సైట్‌ ్చఞట్ట్చఛిజ్టీజ్డ్ఛీుఽ.్ఛఞట్చజ్చ్టజిజీ.ౌటజను ఓపెన్‌ చేయాలి. వెబ్‌సైట్‌ ఇంటర్‌ఫేజ్‌ స్ర్కీన్‌పై బయోమెట్రిక్‌ డివైజ్‌ ఎంట్రీ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిని ప్రెస్‌ చేశాక మరో డిస్‌ప్లేలో డివైజ్‌ డేటాను పూర్తి చేయాల్సి ఉంటుంది. డివైజ్‌ టైప్‌, డివైజ్‌ సీరియల్‌ నెంబర్‌, డివైజ్‌ హోల్డర్‌ పేరు, డోర్‌ నెంబర్‌, జిల్లా, మండలం, నగరంతో పాటు ఎవరైతే దీనిని కలిగి ఉంటారో వారు తమ మొబైల్‌ నెంబర్‌ను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. చివరిగా వారి ఆధార్‌కార్డు కాపీని అప్‌లోడ్‌ చేస్తే సరిపోతుంది.

Updated Date - 2021-06-14T05:11:22+05:30 IST