Abn logo
Oct 30 2020 @ 05:31AM

ఆన్‌లైన్‌ అయోమయం

విద్యార్థులకు అర్ధంకాని విద్యాబోధన

వెంటాడుతున్న సిగ్నల్‌ సమస్య 

ఆన్‌లైన్‌ తరగతులతో మానసికంగా ఆందోళనకు గురవుతున్న విద్యార్థులు 


(ఆంధ్రజ్యోతి, జగిత్యాల):  కరోనా నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. కానీ ఆన్‌లైన్‌లో చెబుతున్న పాఠాలు అర్ధం కావడం లేదని పిల్లల త ల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరగతి గదిలో కూర్చొని పాఠాలు వింటేనే అ ర్థంకాని విద్యార్థులకు, ఇక ఆన్‌లైన్‌ తరగతులు ఎంత మేరకు ఆర్థం అవుతున్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఉపాధ్యాయులు చెప్పింది వినడం తప్ప, ఏమైనా సందేహాలు ఉంటే ఎలా నివృత్తి చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. చెప్పే చదువు పట్ల, తరగ తుల పట్ల విద్యార్థి ఎంత మేరకు ఏకాగ్రతతో వింటున్నాడనేది కూడా మరో సందేహంగా మిగిలింది. దీనికి తోడు ఇంటర్నెట్‌ సమస్య, విద్యుత్‌ సమస్య ఏర్పడితే క్లాసులు మధ్యలోనే ఆగిపోవడం లాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయనే సమస్యలు వినిపిస్తున్నాయి. 


జిల్లాలో 70 వేల మంది విద్యార్థులు

జగిత్యాల జిల్లాలో 861 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, అందులో 511 ప్రాథమిక పాఠ శాలలు, 81 ప్రాథమికోన్నత పాఠశాలలు, 214 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. జిల్లా వ్యా ప్తంగా 3292 మంది ఉపాధ్యాయులు పని చేస్తుండగా, 70 వేల మంది విద్యార్థులు ఉన్నా రు. జిల్లాలో 6398 మంది విద్యార్థులకు డీటీహెచ్‌లు ఉన్నాయని, 38,704 విద్యార్థులకు మొబైల్‌ సౌకర్యం, 35,787 మందికి టీవీలు ఉన్నాయని, 21,003 మందికి ఇంటర్‌నెట్‌ కనెక్ష న్‌ ఉండగా, 190 మందికి ల్యాప్‌టాప్‌లు కూడా ఉన్నట్లు ఇటీవల విద్యాశాఖ అధికారులు చేసిన సర్వేలో తేలినప్పటికీ, పూర్తి స్థాయిలో విద్యార్థులకు ఆశించిన స్థాయిలో ఈ ఆన్‌లైన్‌ తరగతులు విద్యార్థులకు ఉపయోగపడడం లేదనే భావన తల్లితండ్రుల నుంచి వ్యక్తం అవుతోంది. టీ-శాట్‌, దూరదర్శన్‌ ద్వారా ప్రసారాలు సాగేలా చూడాలని కలెక్టర్‌ రవి కేబుల్‌ ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేయగా, విద్యుత్‌ కొరత ఉండకుండా చూసేందుకు కూడా సంబంధిత శాఖను ప్రభుత్వం ఆదేశించింది. అయినా పలుచోట్ల విద్యుత్‌ సమస్య లు విద్యార్థులను వెంటాడుతూనే ఉన్నాయి.


’స్మార్ట్‌’గా పెరుగుతున్న ఒత్తిడి

స్మార్ట్‌ ఫోన్‌లలో గేమ్‌లు ఆడడం తప్ప పాఠాలు వినే ఓపిక విద్యార్థులకు లేకపోవడం , డబ్బులు పెట్టి ఫోన్‌లు కొనిచ్చాం, తప్పనిసరిగా పాఠాలు వినాలి అంటూ తల్లితండ్రులు విద్యార్థులపై ఒత్తిడి తేవడం ఇలా అనేక సమస్యల నడుమ విద్యార్థుల చదువులు సా గుతున్నాయి. కొద్దోగొప్పో చదివే విద్యార్థులు మాత్రమే తమకు అర్థంకాని అంశాలను ఉపా ధ్యాయులకు ఫోన్‌ చేసి నివృత్తి చేసుకుంటున్నారు తప్ప చాలా మట్టుకు విద్యార్థులు కేవలం పాఠాలు వినడం వరకే పరిమితం అవుతున్నారు. ముఖ్యంగా ఇంగ్లీష్‌, గణిత శా స్త్రం, సామాన్య శ్రాస్తం వంటి సబ్జెక్ట్‌లు విద్యార్థులకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఓవైపు అర్థంకాలేక, మరోవైపు ఉపాధ్యాయులను అడిగే ధైర్యం చేయక తమలోతామే షరా మా మూలే  అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, ఆన్‌లైన్‌ తరగతులు తమకు అర్థం కావడం లేద ని విద్యార్థులు పేర్కొనడం గమనార్హం. గణితం విషయంలో ఏదైనా సమస్యలు వస్తే కొం దరు విద్యార్థులు తమ సమస్యను వాట్సాప్‌ ద్వారా అధ్యాపకుని చేరవేసి, తమ సందేహా లు నివృత్తి చేసుకోగా మరికొందరు మాత్రం అన్ని అర్ధం అయ్యినట్లుగా వ్యవహరించడం కొసమెరుపు. విద్యార్థులందరికీ సిలబస్‌ తగ్గించి విద్యార్థులకు తరగతుల నిర్వహణ చేపడు తున్న ఫలితాలు మాత్రం ఏ విధంగా ఉంటాయనేది సందేహంగా మారింది.


భవిష్యత్‌ ప్రశ్నార్థకం 

ఆన్‌లైన్‌ తరగతుల సమస్యలు ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అన్‌లాక్‌ 5.0లో భాగంగా నవంబర్‌ 30వరకు పొడగిస్తూ, పాఠశాలల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వంకు అధికారం బదలాయింపు చేయడంతో సమస్య మరింత జఠిలమయ్యింది. ఆన్‌లైన్‌ తరగ తుల నిర్వహణ అయోమయంగా ఉండడంతో తల్లితండ్రుల్లో  తమ పిల్లల భవిష్యత్‌ ప్ర శ్నార్ధకంగా మారిందనే భావన కలుగుతోంది. పాఠశాలలు తెరిపించాలా? వద్దా..? అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నేటికీ ఎలాంటి ఆలోచన చేయలేదు. గ్రామీణ ప్రాంతాల్లో చదివే నిరుపేద విద్యార్థులకు ఈ ఆన్‌లైన్‌ తరగతుల ఫలాలు ఆశించిన స్థాయిలో అందడం లేకపోవడంతో ఓ వైపు పాఠశాలలు తెరిస్తేనే ఫలితం ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ తరగతుల స్థానంలో అన్ని జాగ్త్రత్తలు పాటిస్తూ, నిబంధనలకు లోబడి మధ్యేమార్గం అనే విధంగా పాఠశాలల నిర్వహణ చేపడితేనే బా గుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విద్యావేత్తలు. ప్రభుత్వం ఆలోచించి చర్యలు చేపడితే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని, పలువురు విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లితండ్రులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
Advertisement