ఉల్లి కన్నీళ్లు

ABN , First Publish Date - 2020-10-23T08:35:37+05:30 IST

ఇటీవల సంభవించిన వరదలు, భారీ వర్షాల ప్రభావంతో ఉద్యాన, కూరగాయల పంటలకు తీవ్ర నష్టాలు వాటిల్లిన ఫలితంగా ఆకు, కూర గాయల ధరలు భగ్గుమంటున్నాయి.

ఉల్లి కన్నీళ్లు

  • భగ్గుమన్న కూరగాయల ధరలు
  • ఏది కొనాలన్నా రూ.80 పైమాటే
  • ఉల్లి కిలో రూ.100.. నాణ్యత నిల్‌
  • తక్కువ ధరలో లభ్యమయ్యేవి బంగాళాదుంప మాత్రమే
  • వరదలు, వర్షాల సాకుతో ధరలు పెంచేసిన వ్యాపారులు
  • వినియోగదారులు విలవిల

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

ఇటీవల సంభవించిన వరదలు, భారీ వర్షాల ప్రభావంతో ఉద్యాన, కూరగాయల పంటలకు తీవ్ర నష్టాలు వాటిల్లిన ఫలితంగా ఆకు, కూర గాయల ధరలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా ఉల్లిపాయలు కిలో రూ.100 ధర పలుకుతోంది. రానున్న రోజుల్లో మరింత ప్రియం కానుండ డంతో వినియోగదారులు ఆందోళన చెందుతు న్నారు. ఇక కూరగాయలు చూస్తే చిక్కుడుకా యలు కిలో రూ.150 అత్యధికంగా ధర పలుకు తున్నాయి. మిగిలిన వివిధ రకాల కూరగాయల ధరలు రూ.80 నుంచి రూ.100 లోపు ఉన్నాయి. ప్రజలకు నిత్యావసరమైన ఆకు, కూరగాయల ధరలను నియంత్రించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందని వినియోగదారులు ఆరోపి స్తున్నారు. బహిరంగ విపణిలో ధరలను దారుణంగా పెంచేసి విని యోగదారులను దోచేస్తున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం మాత్రం చోద్యం చూస్తోందని ఆరోపణలు సంధిస్తున్నారు. ఉల్లిపాయల దిగు మతులపై కేంద్రం ఆంక్షలు సడలిస్తూ నిర్ణయం తీసుకున్నప్పటికీ ప్రస్తుతం మార్కెట్లలో నాసిరకం ఉల్లిపాయల ధర కిలో రూ.100 పలుకుతోందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చిక్కుడుకాయల ధర కిలో రూ.140 నుంచి రూ.160 వరకు పలుకు తోంది. బీరకాయలు, టమోటా, వంకాయలు, క్యారట్‌, దొండకాయలు, బెండకాయలు వంటి వాటి ధరలు కిలో రూ.80 పైమాటే. మిర్చి కిలో రూ.60, కాకరకాయలు రూ.80, క్యాప్సికమ్‌ కిలో రూ.150 పైమాటే. చిలగడదుంపలు రూ.60. ప్రస్తుతం లభ్యమవుతున్న కూరగాయల్లో ఒక్క బంగాళాదుంపలు మాత్రమే కిలో రూ.60కు దొరుకుతున్నాయి. క్యారెట్‌, దొండకాయలు కిలో రూ.60, ఆనబకాయ, దోసకాయలు రూ.50 నుంచి రూ.60 మధ్య ధర పలుకుతోంది. ములక్కాడలు కిలో రూ.130, చింతకాయలు కిలో రూ.80గా ఉన్నాయి. కూర గాయల ధరలు ఇలా ఇక్కసారిగా పెరిగిపోవడంతో వినియోగ దారులు ఆందోళన చెందుతున్నారు. పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని ఉల్లిపాయలు, బంగాళాదుంపలను చౌక డిపోల ద్వారా సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అవి ఆచరణ సాధ్యం కాలేదు. అయితే రాష్ట్రంలోని గోదావరి జిల్లాలతోపాటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కురిసిన భారీ వర్షా లు, వరదల వల్ల కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతినడం వల్ల కొంత పంట దెబ్బతిన్నప్పటికీ, ధరలను భారీగా పెంచేసి వినియోగదారులను నిలువునా దోపిడీకి గురి చేస్తున్న తీరుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ధరల నియంత్రణపై అధికారు లు దృష్టి సారించాలని వినియోగదారులు కోరుతున్నారు. 


కిలో రూ.40కే ఉల్లి

నేటి నుంచి రైతు బజార్లలో  రాయితీపై అమ్మకం :  కన్నబాబు

సర్పవరం జంక్షన్‌(కాకినాడ), అక్టోబ రు 22: ఉల్లిపాయల ధరల నియంత్ర ణకు సీఎం జగన్‌ చర్యలు చేపట్టారని, రైతు బజార్ల ద్వారా శుక్రవారం నుంచి కిలో ఉల్లి రూ.40కే వినియోగదారులకు అందిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ, సహకార మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. గురువారం కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ వర్షాలతో కర్నూలు, ఇతర ప్రాంతాలతోపాటు మహారాష్ట్రలో ఉల్లి పంటకు తీవ్రనష్టం జరిగిందన్నారు. వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాయితీపై కిలో రూ.40కే ఉల్లి సరఫరా చేస్తామన్నారు. ఇందుకు 5 వేల టన్నుల ఉల్లిని నాఫెడ్‌ ద్వారా దిగుమతి కోసం ఇండెంట్‌ పెట్టగా, తక్షణమే వెయ్యి టన్నులు దిగుమతి చేసుకున్నామన్నారు.

Updated Date - 2020-10-23T08:35:37+05:30 IST