మళ్లీ ఘాటెక్కిన ఉల్లి..!

ABN , First Publish Date - 2020-09-17T15:16:16+05:30 IST

దిగుమతులు తగ్గడంతో ఉల్లి, టమోటా ధరలు భారీగా పెరుగుతున్నాయి.

మళ్లీ ఘాటెక్కిన ఉల్లి..!

చెన్నై : దిగుమతులు తగ్గడంతో ఉల్లి, టమోటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత వారంతో పోలిస్తే అన్ని రకాల కాయగూరల ధరలు పెరిగాయి. ముఖ్యంగా పెద్ద ఉల్లి, సాంబారు ఉల్లి, టమోటా, బీన్స్‌, మునక్కాయలు, క్యారట్‌ సహా పలు కూరగాయల ధరలు కిలో రూ.5 నుంచి రూ.20కి పెరిగాయి. కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండడంతో, కరోనా లాక్‌డౌన్‌ కారణంగా తక్కువగా కూరగాయలు సాగు చేపట్టడంతో రాష్ట్రానికి దిగుమతులు తగ్గాయి. గత 15 రోజుల క్రితం పెద్ద ఉల్లి రూ.15 ఉండగా, ప్రస్తుతం రూ.40కి చేరింది. రాబోయే రోజుల్లో దిగుమతులు తగ్గి ఉల్లి కిలో రూ.70 వరకు పెరిగే అవకాశముందని వ్యాపారులు పేర్కొంటున్నారు.

Updated Date - 2020-09-17T15:16:16+05:30 IST