ఉల్లి సాగుతో అప్పులపాలు

ABN , First Publish Date - 2020-08-10T23:20:09+05:30 IST

ఉల్లి పంట అన్నదాతను నిలువునా ముంచింది. దిగుబడి ఆశాజనకంగా ఉన్నప్పటికీ మార్కెట్ లో ధరలు లేకపోవడంతో ..

ఉల్లి సాగుతో అప్పులపాలు

ఉల్లి పంట అన్నదాతను నిలువునా ముంచింది. దిగుబడి ఆశాజనకంగా ఉన్నప్పటికీ మార్కెట్ లో ధరలు లేకపోవడంతో అన్నదాత అప్పులపాలైపోతున్నాడు. కరోనా ప్రభావం ఉల్లిపంటపై తీవ్రంగా పడింది. మార్కెట్‌కు తీసుకెళ్లినా గిట్టుబాటు ధర లేదు. నిల్వ చేద్దామంటే గోదాములు లేవు. దీంతో పండించిన పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. అనంతపురం ఉల్లి రైతు కష్టాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనం. 


నెత్తిన అప్పులు మోస్తున్నారు అనంతపురం ఉల్లిరైతులు. ఉల్లి సాగు కోసం ఎకరానికి రూ.60 వేలు పెట్టుబడి పెట్టి నాలుగు నెలలపాటు శ్రమించి అప్పులు మిగుల్చుకున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో 1000 ఎకరాలకు పైగా ఉల్లి సాగు చేశారు. బళ్లారి రెడ్ రకం ఉల్లివిత్తనాలను సాగు చేశారు. కరీఫ్ సీజన్‌కు ముందు బోర్ల కింద సాగు చేసిన పంటకు సాధారణంగా జులై చివరి నాటికి  మార్కెట్‌లో అత్యధికంగా ధర పలుకుతుందని ఆశించారు. ఎకరాకు 100 క్వింటాళ్ల వరకూ దిగుబడి వచ్చింది. కానీ మార్కెట్‌లో క్వింటా ధర పడిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 

Updated Date - 2020-08-10T23:20:09+05:30 IST