ఉల్లి రైతు ఉసూరు

ABN , First Publish Date - 2022-08-04T04:20:10+05:30 IST

ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లభించక రైతు ఊసురుమంటున్నాడు. గత 20 రోజలుగా కురుస్తున్న వర్షాలకు పంట దెబ్బతింది.

ఉల్లి రైతు ఉసూరు
వదిలేసిన ఉల్లి పంట

  1. తెగుళ్లతో తగ్గిన దిగుబడి
  2. క్వింటం ధర రూ. 500 నుంచి రూ. 800 లోపే 
  3. కూలి కూడా గిట్టుబాటుకాని వైనం
  4. మూగజీవాలకు గ్రాసంగా ఉల్లి పంట 

గోనెగండ్ల, ఆగస్టు 3: ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లభించక రైతు  ఊసురుమంటున్నాడు. గత 20 రోజలుగా  కురుస్తున్న వర్షాలకు  పంట దెబ్బతింది. దీనికి తోడు   గిట్టుబాటు ధర లభించడం లేదు. గత ఏడాది కంటే ఈసారి పెట్టుబడులు పెరిగాయని, ధరలు పడిపోయాయని రైతులు వాపోతున్నారు.  దీనికి తోడు ఈ సీజనలో   రోగాలు సోకడంతో ఉల్లిగడ్డల  నాణ్యత లోపించింది.  సైజ్‌ తగ్గిపోయింది. దీంతో ఉల్లి పంటకు గిట్టు బాటు ధర లభించడం లేదు. గత కొన్ని రోజులుగా వానలు కురుస్తున్నందు వల్ల  ఉల్లి పంటకు మజ్జిగ తెగులు సోకి   నేలకు వాలిపోతున్నది. దీంతో ఉల్లి గడ్డ కుళ్లి పోతున్నదని రైతులు ఆవేదన చెందుతున్నారు. పంటను కొసేందుకు అదునురాకపోయినప్పటికీ  ఉల్లి పెరకాల్సి వస్తోందని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఉల్లి పంటకు గిట్టు బాటు ధర లభించడంలేదు. కర్నూలు మర్కెట్‌లో ఉల్లి క్వింటం ధర రూ. 500 నుంచి రూ. 800 వరకు పలుకుతోంది.  కనీసం కోత కోసిన కూలీలకు  కూడా గిట్టుబాటు కావడం  లేదని రైతులు వాపోతున్నారు.  ఎకరాకు పెట్టబడి దాదాపు రూ. 80వేల నుంచి రూ. 90వేల పైగానే ఉంటోంది.  పెట్టుబడిలో సగం కూడా  చేతికి వచ్చేలా  లేదని రైతులు వాపోతున్నారు.   

2204 ఎకరాల్లో ఉల్లి సాగు

గోనెగండ్ల మండలంలో గోనెగండ్ల, వేముగోడు, అలువాల, గాజులదిన్నె హెచ కైరవాడి, కులుమాల, తిప్పనూరు, పుట్టపాశం తదితర గ్రామాల్లో ఈ ఖరీఫ్‌ సీజనలో దాదాపు 2204 ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. పంటకు గిట్టుబాటు ధర లభించక పోవడంతో  రైతులు గొర్రె లు, మేకలకు గ్రాసంగా ఉల్లి పంటను వదిలేస్తున్నారు. గోనెగండ్లలో కురువ లింగన్న, మహేబుబ్‌, రవి అనే రైతులు   కూలీలకు కూడా డబ్బులు వచ్చే పరిస్థితి లేక  మేకలకు గ్రాసంగా ఉల్లి పంటను వదిలేశారు. 

గిట్టుబాటు ధర లేదు

ఈ సీజనలో పండించిన ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. దిగుబడి కూడా ఆశించనంత లేదు. మూడు ఎకరాలు ఉల్లి సాగు చేశాను. దాదాపు రూ. 2లక్షల పెట్టుబడి పెట్టాను. పంట చేతికి వచ్చే సమయానికి మార్కెట్‌లో గిట్టు బాటు ధర లేదు. మొత్తం నష్టం వచ్చింది. చేసేది లేక పంటను పొలంలోనే వదిలివేశాను. 

- కురువ లింగన్న, ఉల్లి రైతు గోనెగండ్ల

ప్రభుత్వం ఆదుకోవాలి

గత రెండేళ్లనుంచి ఉల్లికి గిట్టుబాటు ధర లభించడం లేదు. ఈ ఏడాది ధర వస్తుందన్న ఆవతో రెండు ఎకరాల్లో రూ. 1.70 లక్షల పెట్టుబడి పెట్టి పంటను  సాగు చేశా. అయితే ఈ ఏడాది కూడా గిట్టుబాటు ధర లేదు. క్వింటం ధర రూ. 500కు మించి పలకడం లేదు.  రవాణ ఖర్చులకు కూడా గిట్టుబాటు కాదు. అందుచేత పంటను పొలంలోనే వదిలివేశాం. ప్రభుత్వం ఆదుకోవాలి. 

- దరగల మహెబుబ్‌, ఉల్లి రైతు గోనెగండ్ల

Updated Date - 2022-08-04T04:20:10+05:30 IST