Abn logo
Sep 22 2020 @ 11:13AM

ఈ ఏడూ ఉల్లి ఘాటే.. కొండెక్కుతోన్న ధరలు

Kaakateeya

అప్పుడే రూ.50కి చేరిన వైనం

ఇంకా పెరగవచ్చంటున్న వ్యాపారులు

రైతుబజార్లలో అందని సబ్సిడీ ఉల్లిపాయలు


గుంటూరు (ఆంధ్రజ్యోతి): గత ఏడాది కన్నీళ్ళు తెప్పించిన ఉల్లి ఈ ఏడాది కూడా అంతకు మించి వినియోగదారులను బాధ పెట్టేలా పరిస్థితులు ఏర్పడుతోన్నాయి. జిల్లా వ్యాప్తంగా బహిరంగ మార్కెట్‌లో ఉల్లిపాయల ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. పది రోజుల క్రితం వరకు కేజీ రూ.20 కంటే తక్కువగానే ఉండగా నేడు రూ.50కి చేరింది. నాణ్యత కొంచెం  తక్కువగా ఉన్న ఉల్లిపాయలను కేజీ రూ.35కి పైగా విక్రయిస్తున్నారు. రైతుబజార్లలోనూ ఇదే రేటు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటోన్నారు. జిల్లాకు అత్యధికంగా ఉల్లిపాయలు మహరాష్ట్ర నుంచి దిగుమతి అవుతుంటాయి. గత ఏడాది భారీ వర్షాలకు అక్కడ పంట తుడిచి పెట్టుకుపోవడంతో తీవ్ర కొరత ఏర్పడింది. దాంతో ఒక దశలో కేజీ రూ.100 వరకు కూ డా ఇక్కడి వ్యాపారులు విక్ర యించారు. గత ఏడాది కన్నా ఉల్లి కొరత ఎక్కువ కావచ్చని కేంద్ర ప్రభు త్వం ఎగుమతులను నిలిపివేసింది. అయినా దేశీయ అవసరాలకు సరిపడా ఉత్పత్తి లేక పోవడంతో ధరలకు రెక్కలు వస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. దీంతో ఉల్లిపా యల దిగుమతికి ఆటంకాలు తలె త్తుతున్నాయి. 


అలానే రాయలసీమ జిల్లాల నుంచి వచ్చే ఉల్లిపా యలు కూడా ఇక్కడి మార్కెట్‌కు దిగుమతి జరగడం లేదు. అక్కడి రైతులు కిసాన్‌ రైలు ద్వారా ఢిల్లీకి ఎగుమతి చేస్తోన్నారు. ఈ కార ణంగా రాష్ట్రంలో కొరత ఏర్పడింది. అక్టోబరు నెలలో కూడా ఇదే విధంగా వర్షపాతం ఉంటే గత ఏడాది మించిన ధరలు చూడాల్సి ఉంటుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది కిలో 150 వరకు రెండు నెలల పాటు ధర ఉంది. ప్రభుత్వా సబ్సిడీపై అందించినప్పటికి అవి ఒక శాతం ప్రజలకు కూడా అందలేదు. కొరత గుర్తించిన వ్యాపారులు ఇప్పటికే దానిని సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ప్రభుత్వాలు మేలుకోకపోతే ఈ ఏడాది కూడా ఉల్లివాసనతో సరిపెట్టుకోవటమే. కాగా లాక్‌డౌన్‌ సమయంలో ఉల్లిపాయలు అమ్ముడు కాక రూ.100కి ఏడు, ఎనిమిది కేజీలను కూడా ఇచ్చా రు. రైతుబజార్లలో సబ్సిడీపై విక్రయించాల్సిన ఉల్లి పాయలను వ్యాపారులు నల్లబజారుకు తరలిస్తున్నారు. సోమవారం ఉదయం చుట్టుగుంట రైతుబజార్‌లో ఉల్లిపాయల బస్తాలు దిగుమతి జరిగినప్పటికీ వాటిని విక్రయించే రైతు అక్కడ లేకుండా పోవడం పలు అనుమానాలకు తావి స్తోన్నది. రైతుబజార్ల ఎస్టే ట్‌ అధికారులు ఇవేమి పట్టించుకోకుండా ప్రేక్షక పాత్రకు పరిమి తం అవుతున్నారు. 


వినియోగం పెరిగితే పరిస్థితి ఏంటి.?

కరోనాకు ముందు సాధారణ పరిస్థితుల్లో ఉన్న వినియోగం కన్నా ప్రస్తుతం హోటళ్లు, హాస్టళ్లు, కార్యక్రమాల్లో వినియోగం గణనీయంగా పడిపో యింది. ఈ పరిస్థితుల్లో గృహ అవసరాలకే కొనుగోలు జరుగు తుంది. అంటే ఒకవిధంగా చూస్తే 50 శాతమే వినియోగం అవు తుంది. జిల్లాలో సాదారణ పరిస్థి తుల్లో ప్రతి రోజూ 14 లారీల ఉల్లి వినియోగం అవుతుంది. కానీ ప్రస్తుతం అది ఏడు లారీలకే పరిమితమైంది. వచ్చే నెల రోజుల్లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరిం చేందుకు ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇదే జరిగితే వినియోగం రెట్టిం పయ్యే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో ఉత్పత్తి పెరి గే పరిస్థితులు లేవు. దీంతో ఉల్లి ధరలు ఏ స్థాయిలో పెరుగుతాయనేది వ్యాపా రులకే అంతుచిక్కడం లేదు. 


పెరుగుతున్న నూనెలు

నిత్యావసరాల ధరలు రోజురోజుకు పెరిగి పోతున్నాయి. ఉల్లి ధరలు మూడు రెట్లు పెరిగితే వంట నూనెల ధరలు వారం రోజుల్లో 30 శాతం పెరి గాయి. ఫామాయిల్‌ తప్ప శనగనూనె, సన్‌ఫ్లవర్‌ ఆయి ల్‌ వంటి నూనెలన్నీ పెరిగాయి. విదేశాల నుంచి దిగు మతులు తగ్గడం వల్ల ధరలు పెరిగాయని మార్కెట్‌ లో చెబుతున్నారు. కానీ వాస్తవం అది కాదని, కృత్రిమ కొరత సృష్టించడం వలన ధరలు పెరుగుతున్నాయని సమాచారం. 

Advertisement
Advertisement
Advertisement