Abn logo
Feb 21 2020 @ 12:04PM

ఒంగోలులో కోటి రుద్రాక్షల పందిరి

ప్రకాశం: ఒంగోలు విశ్వేశ్వరస్వామి దేవాలయంలో కోటి రుద్రాక్షల పందిరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కోటి రుద్రాక్షల మండపం వారణాసిలో మాత్రమే ఉంది. ఆ నమూనాతో శివరాత్రి సందర్భంగా కోటి రుద్రాక్షల మండపాన్ని ఏర్పాటు చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి రుద్రాక్షల పందిరిని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు శివరాత్రిని పురస్కరించుకుని జిల్లాలోని శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని పూజలు, అభిషేకాలు నిర్వహించారు. 

Advertisement
Advertisement
Advertisement