10 రోజులు ఐసోలేషన్‌లో ఉంటే డిశ్చార్జి

ABN , First Publish Date - 2020-07-15T18:06:42+05:30 IST

కరోనా పాజిటివ్‌ బాధితుల ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసే విషయంలో..

10 రోజులు ఐసోలేషన్‌లో ఉంటే డిశ్చార్జి

ఒంగోలు: కరోనా పాజిటివ్‌ బాధితుల ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసే విషయంలో ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. ఇప్పటి వరకూ ఐసోలేషన్‌లో చేరి చికిత్స పొందుతున్న వారికి కొద్ది రోజుల తర్వాత మళ్లీ పరీక్షలు నిర్వహించి నెగెటివ్‌ ఫలితాలు వస్తేనే ఇంటికి పం పుతున్నారు.  ఇకపై ఐసోలేషన్‌లో 10 రోజులు చికిత్స పొం ది ఆరోగ్యం నిలకడగా ఉంటే వారిని డిశ్చార్జి చేయనున్నారు.  సేకరించిన శ్వాబ్‌లను పరీక్షించడం వైద్యఆరోగ్యశాఖకు భా రంగా మారింది. ఒక వైపు సాంకేతిక సిబ్బంది కొరత, మరో వైపు పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌ టెక్నీషియన్లు వైరస్‌ బారిన పడుతుండటం, కిట్ల కొరత తదితర సమస్యలతో పరీక్ష ల్లో తీవ్ర జాప్యం  జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐసోలేషన్‌ వార్డుల్లోని వందల మందికి కోలుకున్న తర్వాత కూడా పరీక్షలు చేయాలంటే  వీలుకాదని భావించిన ప్రభుత్వం వారికి పరీక్షలు చేయకుండానే  వైద్యుల ధ్రువీకరణతో డిశ్చార్జి చేసే లా నిబందనలను మార్చింది. ఇదిలా ఉండగా రిమ్స్‌లోని ఐసోలేషన్‌ నుంచి మంగళవారం 64 మంది బాఽధితులను డిశ్చార్జి చేశారు.  


జిల్లాలో మంగళవారం 131 మందికి కరోనా కేసులు బయటపడ్డాయి.  అత్యధికంగా ఒంగోలులో 27 వెలుగు చూ శాయి.  కందుకూరులో 18, పామూరులో 12, చీరాలలో 10, మార్కాపురంలో నాలుగు, దర్శిలో రెండు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  గిద్దలూరులో ఏడుగురికి వైరస్‌ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. గుడ్లూరులో ఎనిమిది, బల్లికురవలో ఆరు పాజిటివ్‌లు వచ్చాయి. ఇంకా జిల్లాలోనిపలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో  పాజిటివ్‌ల సంఖ్య 1836కి చేరింది. మంగళవారం కరోనాతో ఎవ్వరూ మృతి చెందలేదని రిమ్స్‌ అధికారులు తెలియజేశారు. 


Updated Date - 2020-07-15T18:06:42+05:30 IST